కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి అరుదైన గౌరవం..ఐక్యరాజ్యసమితి వేదికగా ప్రసంగం

-

కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ‘హైలెవల్ పొలిటికల్ ఫోరమ్’ (HLPF) వేదికగా ప్రసంగించనున్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ప్రపంచ పర్యాటకరంగ అభివృద్ధిపై ప్రసంగించేందుకు న్యూయార్క్‌‌కు ఆహ్వానించింది UNWTO. ఈ ఆహ్వానాన్ని అందుకున్న తొలి భారత పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి రికార్డుల్లోకి ఎక్కాడు. జూలై 13, 14 తేదీల్లో న్యూయార్కులోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం వేదికగా కిషన్ రెడ్డి ప్రసంగం ఉండనుంది.


ఇటీవల గోవాలో జరిగిన జీ20 సమావేశాలు విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత నెలకొంది. ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ (UNWTO) ఆధ్వర్యంలో ‘హైలెవల్ పొలిటికల్ ఫోరమ్’ (HLPF) వేదికగా సమావేశాలు జరుగనున్నాయి. ‘గోవా రోడ్ మ్యాప్’ అమలు, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడం, ప్రపంచ దేశాలు, భాగస్వామ్య పక్షాల సమగ్ర కార్యాచరణ లక్ష్యం అన్నారు. జీ-20 దేశాల టూరిజం గ్రూప్ చైర్ హోదాలో హాజరుకానున్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version