‘మేకిన్‌ ఇండియా’ భేష్.. మోదీపై పుతిన్ ప్రశంసలు

-

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. భారత ప్రధాని మోదీని ప్రశంసించారు. మోదీ విధానాలను కొనియాడారు. కేంద్ర సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న మేకిన్ ఇండియాపై పుతిన్ ప్రశంసల జల్లు కురిపించారు. మాస్కోలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పుతిన్ ఈ ప్రస్తావన తీసుకువచ్చారు. దేశీయ ఉత్పత్తులు, బ్రాండ్లను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన భారత్‌ను ఉదహరించారు.

‘భారత్‌లోని మన స్నేహితులు, రష్యాకు గొప్ప స్నేహితుడు అయిన ప్రధాని మోదీ.. కొన్ని సంవత్సరాల క్రితం ‘మేకిన్‌ ఇండియా’ను తీసుకువచ్చారు. భారత ఆర్థికవ్యవస్థలో ఇప్పుడు దీని ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనం కాకపోయినా.. మన స్నేహితుడు చేసిందైన సత్ఫలితాలిస్తుంటే అనుకరించడం తప్పేమీ కాదు’ అని పుతిన్ మోదీని ప్రశంసించారు. మాస్కోలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ మాట అన్నారు.

‘ప్రతి రోజు రష్యా గురించి అంతర్జాతీయ స్థాయిలో అవాస్తవాలు వినిపిస్తున్నాయి. ఈ రెండు దేశాల మధ్య బంధాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ, నిజం ఏంటంటే.. రెండు దేశాల మధ్య బంధం మరింత బలోపేతం అవుతూనే ఉంది’ అని భారత్‌లో రష్యా అంబాసిడర్ డెనిస్ అలిపోవ్‌ గతంలో వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version