ఆధార్ కార్డు విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లల ఆధార్ కార్డు అప్డేట్ కచ్చితంగా చేసుకోవాల్సిందేనని తాజాగా వెల్లడించింది. ఏడు సంవత్సరాలు దాటినా కూడా చేయకపోతే డి-ఆక్టివేట్ చేస్తామని తాజాగా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ వివరించింది.

ఐదు సంవత్సరాల లోపు బయోమెట్రిక్ అలాగే ఐరిష్ అవసరం లేకుండా కేవలం ఫోటో మాత్రమే తీసుకొని ఆధార్ కేంద్రాలు.. ఆధార్ కార్డును అందిస్తున్నాయి. అయితే ఐదు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల లోపు పిల్లల ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలని వెల్లడించింది ప్రభుత్వం. ఆ సమయంలో ఉచితంగానే అప్డేట్ చేస్తామని వివరించింది. ఇక ఏడు సంవత్సరాలు దాటిన పిల్లలకు వంద రూపాయలు చెల్లించాలని ప్రకటన చేసింది.