IFSకు 147 మంది ఎంపిక.. వీరిలో 20 మంది తెలుగు వారే

-

యూపీఎస్సీ నిర్వహించిన ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ మెయిన్‌ పరీక్ష తుది ఫలితాలు బుధవారం రోజున విడుదలయ్యాయి. గతేడాది నవంబరు 26 నుంచి డిసెంబరు 3 వరకు మెయిన్‌ పరీక్ష నిర్వహించగా.. ఈ సంవత్సరం ఏప్రిల్‌ 22వ తేదీ నుంచి మే 1వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇక తాాజాగా అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా ర్యాంకర్ల జాబితాను యూపీఎస్సీ విడుదల చేసింది.

వీరిలో మొత్తం 147 మందిని వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలకు రికమెండ్‌ చేసింది. జనరల్‌ కేటగిరీలో 43 మంది, ఈడబ్ల్యూఎస్‌ 20, ఓబీసీ 51, ఎస్సీ 22, ఎస్టీ 11 మంది చొప్పున ఎంపికయ్యారు. రిత్విక పాండే, కాలె ప్రతీక్ష నానా సాహెబ్‌, స్వస్తిక్‌ యదువంశీ తొలి మూడు ర్యాంకులు సాధించారు. మరోవైపు 147 మందిలో 20 మంది ఏపీ, తెలంగాణ అభ్యర్థులు ఉన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం 50లోపు ర్యాంకుల్లో ముగ్గురు తెలుగు వారు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version