పంట కాపాడుకునేందుకు రైతుల పాట్లు.. రోజుకొకరు ఎలుగుబంటిగా మారి..

-

దుక్కి దున్ని విత్తు వేసింది మొదలు పంట చేతికి వచ్చేదాకా పంటను కాపాడుకునేందుకు రైతులు పడే పాట్లు అంతా ఇంతా కాదు. ఆరుగాలం కష్టపడితేనే పంట చేతికొస్తుంది. అలా ఆరుగాలం ఓ వైపు ప్రకృతి.. మరోవైపు చీడపీడలు.. ఇంకోవైపు పక్షులు, కోతుల బెడద.. ఇలా అన్నింటి నుంచి కంటికి రెప్పలా పంటను కాపాడుకుంటారు రైతులు. ఇలా ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరి ప్రాంత చెరకు రైతులు తమ పంటను కోతుల బారి నుంచి రక్షించుకునేందుకు ఓ వినూత్న ఉపాయం ఆలోచించారు.

ఏకంగా వారే ఎలుగుబంటి అవతారం ఎత్తుతున్నారు. ఈ సమస్యను పలుమార్లు అటవీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా వారి నుంచి స్పందన రాకపోవడంతో విసుగుచెందిన రైతులు ఈ ఆలోచన చేశారు. రోజంతా ఎలుగుబంటి వేషధారణలో పొలాల వద్ద చక్కర్లు కొడుతూ పంటకు కాపలా కాస్తున్నారు. కోతులు తరచూ పంటలపై, పక్కనే ఉన్న పశువులపై దాడి చేస్తున్న నేపథ్యంలో రైతులు తలా కొంత డబ్బు పోగు చేసి ఎలుగుబంటి ముసుగు కొన్నారు. రోజుకో కుటుంబానికి చెందిన వారు ఇలా ఎలుగుబంటి ముసుగు వేసుకుని పంటకు రక్షణగా ఉంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version