ఉత్తర్ ప్రదేశ్ బాందా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న బొలేరో రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. బొలేరోలో ఎనిమిది మంది ప్రయాణిస్తుండగా.. ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోగా.. ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల్లో తల్లీకొడుకులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
తిలౌసా గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలుడు కరెంట్ షాక్కు గురయ్యాడు. చికిత్స కోసం అతడిని బబేరూలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తున్నారు. బాలుడి తల్లి సహా గ్రామానికి చెందిన మరో ఏడుగురు బొలేరో కారులో ప్రయాణిస్తున్నారు. ఆస్పత్రికి తొందరగా వెళ్లాలనే క్రమంలో ప్రమాదవశాత్తు బొలేరో ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడు, తల్లి సహా గ్రామానికి చెందిన కైఫ్, జహీల్, షకీర్, ముసాహిద్, డ్రైవర్ మరణించారు. జహీద్ అనే వ్యక్తి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.