గ్రాండ్ గా మెగా ప్రిన్సెస్ బారసాల.. పేరు కూడా పిక్స్..!

-

గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రాంచరణ్ ఆయన సతీమణి ఉపాసన ఇటీవలే ఒక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇక మెగాస్టార్ నట వారసుడిగా రామ్ చరణ్ ఎట్టకేలకు తండ్రి అయ్యారు. ఈ విషయాన్ని మెగా కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.ఇక తమ కుటుంబంలోకి వచ్చిన కొత్త వ్యక్తి ఆనందాన్ని రెట్టింపు చేసిందని చిరంజీవి కూడా వెల్లడించారు. జూన్ 20వ తేదీన పండంటి బిడ్డకు జన్మనివ్వగా మెగా కాంపౌండ్ లో సంబరాలు మొదలయ్యాయి.

ఇదిలా ఉండగా ఈరోజు రామ్ చరణ్ కూతురు బారసాల అని తెలుస్తోంది. దీంతో మెగా వారసురాలికి ఈరోజు పేరు పెట్టబోతున్నట్లు సమాచారం. బారసాల ఈరోజు చాలా ఘనంగా మెగా కుటుంబ సభ్యుల మధ్య జరగబోతుందని సమాచారం. ఇకపోతే ఈ కార్యక్రమానికి సినీ ఇండస్ట్రీ నుంచి అతిధులు ఎవరెవరు హాజరు కాబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే మరికొన్ని గంటల్లో ఉపాసన రాంచరణ్ ల కూతురు పేరు రివీల్ చేయబోతున్నారు.

ఇదిలా ఉండగా ఉపాసనకు పుట్టేది అమ్మాయే అంటూ మొదటి నుంచి ప్రచారం జోరుగా సాగిన విషయం తెలిసిందే. ఇక అనుకున్నట్టుగానే ఉపాసన పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇక ఉపవాసన డెలివరీకి ఒక నెల ముందు నుంచి రామ్ చరణ్ తన సినిమా షూటింగ్లకు బ్రేక్ చెప్పగా ఈ కీలక సమయంలోనే తన భార్య ఉపాసన పక్కనే ఉంటూ రాంచరణ్ ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. అంతే కాదు డెలివరీ తర్వాత మరో రెండు మూడు నెలల పాటు ఆయన ఇంటికి పరిమితం అవుతానని కూడా వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక తన కూతురితో ఆనందం మధుర క్షణాలను గడపడానికి తాను నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ ను కూడా వాయిదా వేశారు. ఏది ఏమైనా ఈరోజు మెగా ప్రిన్సెస్ పేరు బయటకు రాబోతోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version