LoC వద్ద పాకిస్థాన్ పోస్టులను భారత ఆర్మీ ధ్వంసం చేసిన వీడియో రిలీజ్ ఐంది. ఈ వీడియో ను భారత ఆర్మీ విడుదల చేసింది. ఈ సందర్భంగా భారత్ , పాక్ యుద్ధం నేపథ్యంలో కమాండర్ వ్యోమికా సింగ్ కీలక ప్రకటన చేశారు. భారత్‌ను తీవ్రంగా నష్టపరిచినట్టు.. సోషల్ మీడియాలో పాకిస్థాన్ తప్పుడు ప్రచారం చేస్తోందని పేర్కొన్నారు కమాండర్ వ్యోమికా సింగ్.

ఉదంపూర్‌లోని S-400 సిస్టమ్, సిర్సా్లో ఎయిర్‌ఫీల్డ్స్, నగ్రోటాలో బ్రహ్మోస్ స్పేస్‌లతో పాటు.. ఎన్నో భారత మిలటరీ స్థావరాలను ధ్వంసం చేసినట్టు.. నెట్టింట్లో పాక్ ఫేక్ ప్రచారానికి దిగిందని తెలిపారు. కానీ.. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని, పాక్ ప్రచారాలను భారత్ పూర్తిగా రిజెక్ట్ చేస్తోందని ప్రకటించారు కమాండర్ వ్యోమికా సింగ్. మరోవైపు.. LoC వెంబడి పాక్ డ్రోన్స్, షెల్స్ ప్రయోగం, భారీ ఆయుధాలతో దాడులకు పాల్పడింది… ఈ దాడుల్ని భారత్ తిప్పికొట్టింది.. పాకిస్థాన్ ఆర్మీకి కోలుకోలేని నష్టాన్ని మిగిల్చిందన్నారు.
LoC వద్ద పాకిస్థాన్ పోస్టులను భారత ఆర్మీ ధ్వంసం చేసిన వీడియో#IndiaPakistanWar #IndiaPakistanTensions #IndianArmy #SofiaQureshi @adgpi pic.twitter.com/v6qXv9xOfl
— PulseNewsBreaking (@pulsenewsbreak) May 10, 2025