అర్థరాత్రి యువకుడి రన్నింగ్ వీడియో వైరల్… కారణం వింటే అభినందించకుండా ఉండలేదు

-

ఒక యువకుడు అర్థరాత్రి పరిగెత్తుతుంటే ఏదో ఎమర్జెన్సీ అయి ఉంటుందని చాలా మంది అనుకుంటారు. కానీ ఆ యువకుడి లక్ష్యం గురించి వింటే మాత్రం అతన్ని అభినందించకుండా ఉండలేరు. ప్రస్తుతం ఢిల్లీలో అర్థరాత్రి… భుజానికి బ్యాగ్ వేసుకుని పరిగెత్తుతూ ఇంటికి వెళ్తున్న ఈ వీడియో ప్రస్తుతం దేశంలో వైరల్ గా మారింది. అంతలా పరిగెత్తాల్సిన అవసరం ఏముంది. ఏదైనా వాహనంలో ఇళ్లకి వెళ్లవచ్చు కదా…? అని డౌట్ రావచ్చు కానీ.. ఆ యువకుడు చెప్పిన సమాధానం వింటే ఎంతటి వారైనా అభినందించకుండా ఉండలేదు.

ఈ వీడియోను ప్రముఖ దర్శక, నిర్మాత వినోద్ కప్రీ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. 19 ఏళ్ల యువకుడు అర్థరాత్రి ఢిల్లీలో నోయిడాలో పరిగెత్తుతుండటం చూసి.. వినోద్ కప్రీ ఆ యువకుడికి లిఫ్ట్ ఇస్తా అని ఆఫర్ చేశాడు. అందుకు ఆ యువకుడు తిరస్కరించాడు. ఇలా పరిగెత్తుతున్న యువకుడితో వినోద్ కప్రీ మాటలు కలిపాడు. యువకుడు పరిగెత్తుతున్న సమయంలో కారు నుంచి తన సెల్ ద్వారా వీడియో తీశాడు. 

యువకుడు పరిగెత్తున్న సమయంలో మళ్లీ లిఫ్ట్ ఇస్తా అని ఆఫర్ చేశాడు. తనకు పరిగెత్తేందుకు ఇప్పుడే సమయం దొరుకుతుందని..ఆ యువకుడు సమాధానం ఇచ్చాడు. ఇలా అర్థరాత్రి ఎందుకు పరిగెత్తుతున్నావ్ అని అడిగితే..తనకు సైన్యంలో చేరాలని కోరిక అని.. అందుకే ప్రాక్టిస్ కోసం ఇలా పరిగెత్తుతున్నానని సమాధానం ఇచ్చాడు. అయితే ఉదయం పరిగెత్తవచ్చు కదా..అని కప్రీ అడిగితే నేను మెక్ డోనాల్డ్ లో పనిచేస్తున్నా అని.. ఉదయం 8 గంటల నుంచే డ్యూటికి వెళ్లాలని, వంట చేసుకోవడానికే టైం సరిపోతుందని సదరు యువకుడు సమాధానం ఇచ్చాడు. అందకే వ్యాయామం సరిగా ఉండదని, తనకు టైం దొరికేది ఇప్పుడే అని అన్నాడు. ఉత్తరాఖండ్ రాష్ట్రం మెహ్రకు చెందిన ప్రదీప్, నోయిడా సెక్టార్ 16లో తను ఉద్యోగం చేసే చోటు నుంచి బరోలా లోని తన ఇంటికి రోజూ 10 కిలోమీటర్లు పరిగెత్తుతున్నాడు. తన సోదరుడితో కలిసి ఉంటున్నట్లు, తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నట్లు కప్రితో అన్నాడు.

ఆ యువకుడితో.. వినోద్ కప్రీ ఈ వీడియో వైరల్ అవుతుంది అనగా.. నన్నెవరు గుర్తు పడతారని నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. ఇంటికి వెళ్లి వంట చేయాలని చెప్పినప్పుడు నాతో రా నేను డిన్నర్ కు తీసుకెళ్లా అని వినోద్ కప్రీ అనడంతో … ఇంట్లో తమ్ముడు ఉంటాడు కదా అని ప్రదీప్ సమాధానం ఇస్తాడు.

చివరకు ఆ యువకుడికి శుభాకాంక్షలు తెలుపుతూ… ప్యూర్ గోల్డ్ అంటూ వీడియోను షేర్ చేశాడు. ప్రదీప్ కథ మిలియన్ల మందికి స్ఫూర్తినిస్తుందని వ్యాఖ్యానించాడు. ఈ వీడియో వైరల్ అయింది. గంటల్లోనే 1.8 మిలియన్ వ్యూస్ దక్కాయి. లక్షకు పైగా లైక్స్ వచ్చాయి. ట్విట్టర్ లో ట్రెండింగ్ ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version