ఆసియా కప్ 2023 టోర్నమెంటులో టీమిండియా శుభారంభం చేసింది. నిన్న నేపాల్ జట్టుపై జరిగిన మ్యాచ్లో అద్భుతమైన విజయం సాధించింది టీమిండియా. మొదట బ్యాటింగ్ చేసిన నేపాల్ జట్టు 48.2 ఓవర్లలో 230 పరుగులు చేసింది. అయితే నేపాల్ బ్యాటింగ్ చేసిన తర్వాత భారీ వర్షం కురిసింది. దీంతో డక్వర్తు లూయిస్ ప్రకారం 147 పరుగులకు లక్ష్యాన్ని కుదించారు అంపైర్లు. అయితే ఆ లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా 20 ఓవర్లలో చేదించేసింది టీమిండియా.
అయితే.. ఇండియా – నేపాల్ మ్యాచ్ నేపథ్యంలో కింగ్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరింది. వికెట్ కీపర్ కాకుండా 100 క్యాచులు(143) అందుకున్న రెండో ఇండియన్ ప్లేయర్ గా నిలిచారు. నిన్న ఆసియా కప్ లో నేపాల్ తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ సింగిల్ హ్యాండ్ తో అద్భుతమైన క్యాచ్ అందుకున్నారు. తద్వారా మాజీ సారథి అజారుద్దీన్(156) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత ఆటగాడిగా నిలిచారు. కాగా, టీ20లో విరాట్ 50 క్యాచ్లు పట్టారు.