ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య వార్ మొదలైంది. గురువారం రాత్రి తొమ్మిది గంటల నుంచి.. అర్ధరాత్రి రెండు గంటల వరకు పాకిస్తాన్ పై ఇండియన్ ఆర్మీ ఏకధాటిగా దాడులు చేసింది. దీంతో పాకిస్తాన్ లో పరిస్థితులు అత్యంత దారుణంగా తయారయ్యాయి. పాకిస్తాన్ ప్రధాని ఇంట్లో నుంచి పారిపోయి బంకర్లో దాచుకున్నాడు.
అయితే ఈ నేపథ్యంలోనే… బార్డర్ లో ఉన్న జమ్ము కాశ్మీర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు… సెలవులు లేకుండా ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో… విద్యా సంస్థలకు హాలిడేస్ ప్రకటించింది. జమ్ము కాశ్మీర్ తో పాటు అస్సాం, రాజస్థాన్, పంజాబ్, హర్యానా అలాగే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు కూడా ఇదే తరహాలో నిర్ణయం తీసుకున్నాయి.
ఈ రాష్ట్రాలలో ఎండాకాలంలో కాకుండా శీతాకాలంలో హాలిడేస్ ఉంటాయి. అందుకే మన దగ్గర హాలిడేస్ ఉంటే అక్కడ స్కూల్స్ నడుస్తున్నాయి. అయితే వాటికి వారం రోజులపాటు హాలిడేస్ ప్రకటించారు. యుద్ధ వాతావరణం పూర్తయిన తర్వాత మళ్లీ ఓపెన్ అవుతాయి.