BCCI releases statement after IPL 2025 matches IPL రద్దు చేసే అవకాశం లేదని క్లారిటీ ఇచ్చింది BCCI. సెక్యూర్ స్టేట్స్‌లో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామని ప్రకటించింది. ఆటగాళ్లకు పూర్తి రక్షణ కల్పిస్తామని పేర్కొంది. ఢిల్లీ, లక్నో, జైపూర్, హైదరాబాద్, వైజాగ్, చెన్నై, బెంగళూరు లాంటి సురక్షిత ప్రాంతాలు మాకు ఉన్నాయని వివరించింది BCCI.

కాగా, పాక్ దాడుల నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్ రద్దు అయింది. పాక్, ఇండియా వార్ ప్రభావం పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ మ్యాచ్‌పై పడింది. జమ్మూ ఎయిర్ పోర్టుపై పాక్ దాడి చేయడంతో అప్రమత్తమైన సైన్యం ధర్మశాలలోనూ బ్లాక్ అవుట్ ప్రకటించింది. విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. ఫ్లడ్ లైట్స్ బంద్ కావడంతో సగంలోనే మ్యాచ్ నిలిచిపోయింది.