కోమాలో ఉన్న భర్త ఆస్తిని భార్య అమ్ముకోవచ్చు : హైకోర్టు

-

కోమాలో ఉన్న భర్త ఆస్తి విక్రయించేందుకు భార్యకు హక్కు ఉందని మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అనారోగ్యంతో బాధపడుతూ కోమాలోకి వెళ్లిన భర్త ఆస్తులకు తనను గార్డియన్‌గా నియమించాలని కోరుతూ చెన్నైకి చెందిన శశికళ అనే మహిళ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని పరిశీలించిన సింగిల్‌ బెంచ్‌ జడ్జి.. అందుకు చట్టంలో స్థానం లేదని, పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరించింది. సివిల్‌ కోర్టును ఆశ్రయించాలని ఉత్తర్వు ఇచ్చింది.

దీనిపై శశికళ అప్పీల్‌కు వెళ్లగా జస్టిస్‌ స్వామినాథన్, జస్టిస్‌ బాలాజీల ధర్మాసనం విచారించి.. చట్టంలో ఏ మార్గం లేకపోయినా ‘సంరక్షకురాలు’ అనేలా కోర్టు ఉత్తర్వులు ఇవ్వొచ్చు అని గతంలో కేరళ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం గుర్తుచేసింది. భర్త ఆస్తుల నిర్వహణకు భార్యకు అనుమతిస్తూ ఉత్తర్వులు ఇస్తూ.. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను కొట్టివేసింది. శశికళను తన భర్త శివకుమార్‌కు గార్డియన్‌గా నియమించి, రూ.కోటి విలువైన ఆస్తిని విక్రయించేందుకు kajd’g అనుమతించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version