కుర్రాడితో అక్రమ సంబంధం… భర్తను హత్య చేయించిన భార్య

-

తమిళనాడులో పథకం వేసి ప్రియుడితో భర్తను హత్య చేయించారు భార్య. జరిగిందంతా చెప్పి తల్లిని, ఆమె ప్రియుడిని పోలీసులకు పట్టించింది మూడేళ్ల కూతురు. వేలూరు జిల్లా కుప్పంపాళ్యానికి చెందిన భారత్(36)కు, ఐదేళ్ల కిందట బెంగళూరుకు చెందిన నందిని(26)తో వివాహం కాగా.. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భారత్ చెన్నైలో ఓ హోటల్‌లో వంట మాస్టర్‌గా పనిచేస్తూ, వారంలో ఒకరోజు ఇంటికి రాగా.. ఇంటి వద్దే ఉంటూ, ఎదురింటి సంజయ్(21) అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది నందిని.


ఈ విషయం తెలిసి, పద్దతి మార్చుకోవాలని నందినిని పలుమార్లు హెచ్చరించారు భారత్. ఈ నెల 21న ఇంటికొచ్చి సరకుల కోసం భార్య, చిన్న కూతురును బైక్‌పై దుకాణానికి తీసుకెళ్లాడు. ఇక పథకం ప్రకారం తిరిగి వచ్చే మార్గంలో హత్య చేయడానికి సంజయ్‌ని ఉంచింది నందిని. తిరిగొస్తున్నప్పుడు రోడ్డుపై కొబ్బరిమట్టలు ఉండటంతో వాటిని దాటే క్రమంలో కిందపడింది బైక్. ఒక పొదలో దాక్కొని ఇదంతా గమనించి, బైక్‌పై నుండి కిందపడ్డ భారత్‌ను కత్తితో పొడిచి చంపి, పారిపోయాడు సంజయ్. విచారణలో నందిని పొంతన లేని సమాధానాలు చెప్పడంతో, మూడేళ్ల చిన్నారిని అడిగారు పోలీసులు.
తన ఇంటి ఎదురు సంజయ్ మామ తండ్రిని కొట్టి పారిపోయాడని తెలిపింది నందిని మూడేళ్ల కూతురు. దీంతో హత్యకు వివాహేతర సంబంధమే కారణమని తేల్చి, నందినిని, సంజయ్‌ని అరెస్ట్ చేశారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news