పాకిస్తాన్ విపత్తు వైపు వెళుతుందని, అది దేశ విచ్చిన్నానికి దారి తీయవచ్చు అని అన్నారు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. తన పార్టీకి, ఆర్మీకి మధ్య ఘర్షణ వాతావరణం తెచ్చేందుకు అధికారంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ఆరోపించారు. ఈ రాజకీయ అస్థిరతను తొలగించేందుకు ఎన్నికల నిర్వహించడమే మార్గం అన్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లో దేశం విడిచి వెళ్ళేది లేదని.. చివరి శ్వాస వరకు పాకిస్తాన్ లోనే ఉంటానన్నారు.
దేశం నుంచి పరారై లండన్ లో ఉంటున్న నవాజ్ షరీఫ్ వంటి నేతలు దేశ రాజ్యంగం గురించి ఆలోచిస్తున్నారా..? అని ప్రశ్నించారు. తాను ఆర్మీ ని విమర్శించడం అంటే తన పిల్లలను మందలించినట్లేనని వ్యాఖ్యానించారు. తాజా సర్వేలో 70% మంది ప్రజలు తమ పార్టీకి అనుకూలంగా ఉన్నట్లు తేలిందని చెప్పుకొచ్చారు ఇమ్రాన్ ఖాన్.