పెళ్లైన నెలరోజులకే భర్తకు షాక్.. మరో అమ్మాయితో భార్య జంప్

-

ఈ మధ్య అమ్మాయి-అమ్మాయి, అబ్బాయి-అబ్బాయి ప్రేమలో పడటం.. పెళ్లి చేసుకోవడం వంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇన్నాళ్లు సమాజానికి.. కుటుంబానికి భయపడ్డ వారంతా తమ ఇష్టాన్ని ఇప్పుడు స్వేచ్ఛగా బయటకు చెప్పేస్తున్నారు. అలా ఓ అమ్మాయి మరో అమ్మాయితో ప్రేమలో పడింది. కానీ ఆ కుటుంబం ఆమెకు వేరే అబ్బాయితో పెళ్లి చేసింది. ఆ తర్వాత ఏమైందంటే..?

బంగాల్​లోని ఆలిపుర్ద్వార్​ జిల్లాలోని ఫలకాటా ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయి, కూచ్​బిహార్​​ జిల్లాలోని తుఫాన్​గంజ్​ ప్రాంతానికి చెందిన ఇంకో అమ్మాయి.. ఒకే కాలేజీలో చదువుతున్నారు. రెండేళ్ల క్రితం ఫుట్​బాల్​ ఆడుతుండగా.. ఈ ఇద్దరమ్మాయిల మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. వీరి ప్రేమ వ్యవహారం వారి ఇంట్లో తెలిసింది.

తుఫాన్​గంజ్​కు చెందిన అమ్మాయి తల్లిదండ్రులు నెల రోజుల క్రితం హడావుడిగా తమ కుమార్తెకు ఓ యువకుడితో వివాహం జరిపించారు. పెళ్లైనా ఆ యువతి తన ప్రేమను చంపుకోలేకపోయింది. బతికినా చనిపోయినా తను ప్రేమించిన అమ్మాయితోనేనని భావించి పెళ్లైన నెలరోజుల తర్వాత గత బుధవారం తను ప్రేమించిన అమ్మాయితో జంప్ అయింది.

అనంతరం ఆ ఇద్దరు యువతులు మల్దా ప్రాంతంలోని ఓ హోటల్​లో రూమ్ అద్దెకు తీసుకున్నారు. వారి ప్రవర్తన కాస్త అనుమానంగా ఉండటంతో హోటల్ సిబ్బంది నిలదీయగా అసలు విషయం బయటపడింది. దీంతో వారిని పోలీసుల వద్దకు తీసుకువెళ్లారు. పోలీసులు ఆ యువతులను వారి కుటుంబాలకు అప్పగిస్తామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version