ఫామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఫెయిల్..రూ.1.2 లక్షలని 16 ఏళ్ల పాటు చెల్లించాలన్న తమిళనాడు ప్రభుత్వం..!

-

ఐదేళ్ల తర్వాత ఒక మహిళ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే ఫామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకోవడం.. అది ఫెయిల్ అవ్వడం ఆడపిల్లకి జన్మనివ్వడం జరిగింది. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఫెయిల్ అవ్వడం వలన మద్రాస్ హైకోర్టు రాష్ట్రాన్ని మూడు లక్షల రూపాయలు ఆ మహిళ కి ఇవ్వాలి అని చెప్పింది.

అలానే సంవత్సరానికి 1.20 లక్షల రూపాయలని ఆ పిల్లకి ఇవ్వాలని… 21 ఏళ్లు వచ్చే వరకు కానీ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే వరకు కానీ ప్రతి ఏడాది కూడా ఆమెకి 1.20 లక్షల రూపాయలు ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు చెప్పింది. డాక్టర్లు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయడంలో విఫలమయ్యారని… డాక్టర్ల అజాగ్రత్త వల్ల ఇది చోటుచేసుకుందని.. వాళ్లదే తప్పని జస్టిస్ కృష్ణ రామస్వామి అన్నారు.

కన్యాకుమారి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ లో ఇద్దరు పిల్లలకి జన్మనిచ్చిన ఒక ఆమె ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్నారు. అయినప్పటికీ సెప్టెంబర్ 2017 లో మళ్ళీ కన్సీవ్ అయ్యారు. అయితే ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళకి ఉన్నారు. దీనితో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది.

ఆర్థిక ఇబ్బందులు కుటుంబంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈమె మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. మొత్తం అన్నింటినీ పరిశీలించి ఆమెకి మూడు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పారు. అలానే ఆమెకి పుట్టిన అమ్మాయికి అయ్యే పుస్తకాలు ఖర్చులు, స్టేషనరీ మరియు ఇతర చదువు ఖర్చులు కూడా రెస్పాండెంట్స్ బాధ్యత అని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news