బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ సతీమణి గౌరీ ఖాన్ ఇటీవలే ‘టోరి’ (Torii) పేరుతో ముంబయిలోని బాంద్రాలో ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ రెస్టారెంట్లో ఫేక్ పనీర్ సర్వ్ చేస్తున్నారని ఓ యూట్యూబర్ ఆరోపించాడు. యూట్యూబర్ సార్థక్ సచ్‌దేవా ఇటీవల టోరి రెస్టారెంట్‌కు వెళ్లి ఫుడ్ ఆర్డర్ చేశాడు. అందులో పనీర్ టేస్ట్ కాస్త డిఫరెంట్ గా అనిపించగా.. ఓ ముక్కను పక్కకు తీసి దానికి అయోడిన్ టింక్చర్ పరీక్ష చేయించగా అది ఫేక్ పనీర్ అని తేలినట్లు తెలిపాడు. ఈ విషయం చెచబుతూ ఓ వీడియో పోస్ట్ చేయడంతో ఇప్పుడు ఇది చర్చనీయాంశమైంది.
యూట్యూబర్ ఆరోపణలపై టోరి యాజమాన్యం స్పందిస్తూ సచ్‌దేవా ఆరోపణలను ఖండించింది. అయోడిన్ పరీక్ష స్టార్చ్ ఉనికిని ప్రతిబింబిస్తుంది కానీ పనీర్ నాణ్యత ప్రామాణికతను కాదంటూ చెప్పుకొచ్చింది. తాను ఆర్డర్ చేసిన వంటకంలో సోయా ఆధారిత పదార్థాలు ఉన్నందు వల్లే, అలాంటి రియాక్షన్ వచ్చిందని తెలిపింది. అంతే కానీ తమ పనీర్ ఫేక్ కాదని స్పష్టం చేసింది. టోరీలో వడ్డించే పదార్థాలన్నీ నాణ్యంగా, ఆరోగ్యంగా ఉంటాయని హామీ ఇస్తూ ప్రకటన జారీ చేసింది.