BREAKING : జింబాబ్వే మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ ఇంకా చనిపోలేదు..!

-

BREAKING : జింబాబ్వే మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ విషయంలో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. జింబాబ్వే లెజెండరీ క్రికెటర్, మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్(49) క్యాన్సర్ తో కన్నుమూశారని ఇవాళ ఉదయం నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. గతంలో జింబాబ్వే టీం కెప్టెన్ గా, బెస్ట్ బౌలర్ గా ఉన్న ఆయన… టెస్టుల్లో 216 వికెట్లు, వన్డేల్లో 239 వికెట్లు తీశారు.

Former Zimbabwe Captain Heath Streak Has Passed Away Aged 49 Battle With Cancer

జింబాబ్వే తరపున 100 టెస్ట్ వికెట్లు తీసిన తొలి బౌలర్ గా నిలిచిన స్ట్రీక్…2005లో క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. బంగ్లాదేశ్, జింబాబ్వే, ఐపీఎల్ లో KKR టీమ్ కు కోచ్ గా వ్యవహరించారు. అలాంటి జింబాబ్వే మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ క్యాన్సర్‌ తో మరణించారని ఓ వార్తను వైరల్‌ చేశారు. వాస్తవానికి జింబాబ్వే మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ ఇంకా చనిపోలేదట. ఈ విషయాన్ని జాతీయ మీడియా గుర్తించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version