వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా జనగణన!

-

దేశవ్యాప్తంగా జనగణన నిర్వహించేందుకు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది -2025 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమై 2026 వరకు కొనసాగవచ్చని సమాచారం. ఆ తర్వాతే లోక్‌సభ స్థానాలకు సంబంధించిన డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభం కానుందని సంబంధిత వర్గాల సమాచారం. ఆ ప్రక్రియ 2028కి వరకు ముగుస్తుందని తెలుస్తోంది.

రాష్ట్రాల వారీగా, జాతీయ స్థాయిలో రకరకాల అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు రూపొందించి అమలుపరచడానికి ఈ జనగణన కీలకంగా మారనుంది. ప్రతి పదేళ్లకు ఒకసారి దేశంలో జనగణన నిర్వహించాల్సి ఉన్న గత ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. కొవిడ్‌ సంక్షోభం తర్వాత నుంచే జనగణన ప్రక్రియ చేపట్టాలని ప్రతిపాదనలు వచ్చినా కేంద్ర ప్రభుత్వం దీనిపై ఎక్కువ స్పందించలేదు. తాజాగా ఈ మేరకు కసరత్తులు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news