కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నేడు, రేపు దేశ వ్యాప్త స‌మ్మె

-

కేంద్ర ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తున్న ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌కు నిర‌స‌నగా నేడు, రేపు దేశ వ్యాప్తంగా స‌మ్మె నిర్వ‌హించాల‌ని ప‌లు కార్మిక సంఘాలు నిర్ణ‌యించాయి. గ్రామాల నుంచి ప‌ట్ట‌ణాల వ‌ర‌కు స‌మ్మె ఉంటుంద‌ని కార్మిక స‌ఘాల ప్రతినిధులు తెలిపారు. ఈ స‌మ్మెలో దాదాపు 20 కోట్ల‌కు పైగా కార్మికులు పాల్గొంటార‌ని తెలిపారు. ఈ స‌మ్మెలో రవాణా, బ్యాంకింగ్, రైల్వే, విద్యుత్, తో పాటు కోల్, స్టీల్, ఆయిల్, టెలికాం, పోస్ట‌ల్, ఇన్ మ్ ట్యాక్స్, కాప‌ర్, ఇన్సూరెన్స్ తో పాటు ప‌లు రంగాలు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. ఇప్ప‌టికే వీరు స‌మ్మె నోటీస్ ను కూడా ఇచ్చారు.

వీరితో పాటు దేశ వ్యాప్తంగా ఆటో రిక్షలు కూడా బంద్ కానున్నాయి. కాగ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వం.. ఇటీవ‌ల ఐదు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన త‌ర్వాత‌… ప్ర‌జ‌లపై భారం మోపే విధంగా చేస్తుందని కార్మిక సంఘాల ప్ర‌తినిధులు అన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, కీరోసిన్, సీఎన్ జీ ధ‌ర‌ల‌ను ఒక్క సారిగా పెంచారిన మండిప‌డ్డారు.

ఈపీఎఫ్ వ‌డ్డీ రేటును 8.5 శాతం నుంచి 8.1 శాతానికి త‌గ్గించింద‌ని అన్నారు. అలాగే వ‌రుస‌గా ప్ర‌భుత్వ ఆస్తుల‌ను ప్ర‌యివేట్ ప‌రం చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేంద్ర ప్ర‌భుత్వం అవ‌లంభిస్తున్న ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తు.. స‌మ్మె చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version