వీళ్ళ తెలివి తగలెయ్య.. పోలీస్ స్టిక్కర్ లు వేసి మందు స్మగ్లింగ్ !

-

ఏపీలో మద్యానికి భారీగా రేట్లు ఉండడంతో పక్కరాష్ట్రాల నుంచి అక్రమంగా భారీగా మద్యం సరఫరా అవుతోంది. ఎన్నిరకాలుగా కంట్రోల్ చేసినా అక్రమార్కులు ఏదో రూపంలో తీసుకొస్తూనే ఉన్నారు. మరికొందరు ఏమో ఏపీలోనే నాటు సారా కాసి అమ్ముతున్నారు. కాయడం వరకూ ఓకే మరి దానిని పోలీసులకి అనుమానం రాకుండా అమ్మడం ఎలా అని ఆలోచించి పోలీసుల పేరునే వాడుకుందామని ఫిక్స్ అయ్యారు. చివరికి పోలీసుల చేతికి చిక్కి ఊచలు లెక్కిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే కడప జిల్లా రాజంపేట ఎన్ ఫోర్స్ మెంట్ సీఐ శివసాగర్ బృందం గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం వాహన తనిఖీలు చేస్తుండగా పోలీస్ అంటూ స్టిక్కర్ ఉన్న ద్విచక్ర వాహనం ఒకటి అనుమానాస్పదంగా కనిపించింది. దానిని పట్టుకుని పరిశీలించగా అందుట్లో నాటు సారా ప్యాకెట్లు దొరికాయి. దీంతో ఆ నాటు సారా పంపిణి చేస్తున్న వ్యక్తి ని అదుపులోకి తీసుకున్నారు. రాజంపేట నుండి ఆకేపాడుకు వెళ్లే దారిలో ఈ ఉదయం వాహనతనిఖీలు నిర్వహించగా రోళ్లమడుగుకు చెందిన సురేంద్ర అనే వ్యక్తి పోలీస్ బోర్డు ఉన్న పల్సర్ వాహనంలో 5 లీటర్ల క్యాన్ లో 4 లీటర్లు నాటుసారా పెట్టి తరలిస్తూ పట్టుబడ్డాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ సీఐ శివసాగర్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version