థర్డ్ ఫ్రంట్ వచ్చే అవకాశం లేదు.. విపక్షాలకు షాక్‌ ఇచ్చిన నవీన్ పట్నాయక్

-

భారత ప్రధాని మోడీతో ఒడిశా సీఎం, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ గురువారం భేటీ అయ్యారు. అయితే ఈ భేటీ తరువాత దేశ రాజకీయాల్లో నెలకొన్న పరిస్థితులపై నవీన్ పట్నాయక్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఓవైపు విపక్ష పార్టీలు ఏకతాటిపైకి రప్పించే ప్రయత్నాలు జరుగుతున్న వేళ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారాయి. మోడీతో భేటీ అనంతరం పట్నాయక్ మీడియాతో మాట్లాడుతూ తనకు సంబంధించినంత వరకు థర్డ్ ఫ్రంట్ వచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పారు.

తాను ఒడిశాకు సంబంధించిన అంశాలపై ప్రధాని మోడీని కలిశానన్నారు. తమ రాష్ట్ర సమస్యలను పరిష్కరించే విషయంలో తప్పక సాయం చేస్తామని మోడీ భరోసా ఇచ్చినట్లు పట్నాయక్ తెలిపారు. అయితే ఓ వైపు బీజేపీకి వ్యతిరేకంగా బిహార్ సీఎం నితీష్ కుమార్ దేశంలోని విపక్ష పార్టీలను ఏకం చేసి వచ్చే ఎన్నికల్లో మోడీ ప్రభుత్వాన్ని గద్దే దించడమే లక్ష్యంగా పని చేస్తున్న తరుణంలో తృతీయ ఫ్రంట్‌కు ఆస్కారమే లేదని పట్నాయక్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version