రైతు కన్నీరు పెడితే రాష్ట్రం సుభిక్షంగా ఉండదు : పవన్‌

-

అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోయారని, ఉమ్మడి తూ.గో జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో పర్యటించామన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇవాళ ఆయన మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన నష్టానికి ప్రభుత్వాన్ని విమర్శించడం మా ఉద్దేశ్యం కాదన్నారు. కానీ రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు అధికారులెవ్వరూ వెళ్లలేదని, తరుగు పేరుతో రైతులను దోచేస్తున్నారన్నారు. అంతేకాకుండా.. ‘రైతు తాను పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి 60 కిలో మీటర్ల మేర ప్రయాణం చేయాల్సి వస్తోంది. మంత్రులు.. ఎమ్మెల్యేలు.. వ్యవసాయ అధికారులు సరిగా స్పందించి ఉంటే ఈ స్థాయి నష్టం ఉండదని రైతులు అంటున్నారు. నేను వస్తున్నానంటే గోనె సంచులు ఇచ్చారు. బంగారాన్ని కుదవ పెట్టి వ్యవసాయం చేస్తోన్న రైతులకు నష్టం వాటిల్లుతున్నా పట్టించుకోకుంటే ఎలా..? మంత్రులు వచ్చి సాయం చేయకపోగా రైతులను అనుచిత వ్యాఖ్యలతో దుర్భాషలాడుతున్నారు.

గిట్టుబాట ధర అడిగితే.. న్యాయం చేయమని అడిగితే కేసులు పెడుతున్నారని రైతులు బాధ పడుతున్నారు. మేం కష్టపడి పని చేస్తుంటే క్రిమినల్సుగా చూస్తారా అంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. పావలా వడ్డీ రుణాలు ఇస్తే.. మేమ నలుగురికి అన్నం పెడతామంటున్నారు రైతులు. వ్యవసాయ శాఖ అస్సలు పని చేయడం లేదని రైతులే చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వం తమని జలగల్లా పీడిస్తున్నారని రైతులు అంటున్నారు. రైస్ బౌల్ లాంటి ఏపీలోని రైతులకు ఇలాంటి పరిస్థితా అనే బాధ కలిగించింది. చివరి ధాన్యపు గింజ కొనుగోలు చేసేంత వరకు రైతులకు అండగా ఉంటాం. రైతు కన్నీరు పెడితే రాష్ట్రం సుభిక్షంగా ఉండదు.

నేను సంపూర్ణమైన రైతును కాను. కానీ కష్టాల్లో ఉన్న రైతుల బాధ అర్ధం చేసుకునే మానవతా వాదిని నేను. అన్నీ తెలుసనంటున్న వైసీపీ నేతలు రైతులకేం చేశారు. లెఫ్ట్ అండ్ రైట్ పార్టీలతో కలిసే వైసీపీపై పోరాటం చేయాలనే నాకుంది. కానీ ఎవరి సిద్దాంతాలు వారికి ఉంటాయి. వైసీపీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో ప్రభావితం చేసే పార్టీలు కలవాలని కోరుకుంటున్నాం. బీజేపీ, బీఆర్ఎస్ వంటి పార్టీలు పొత్తులతోనే బలపడ్డాయి. ప్రతి పార్టీకి వారి వారి ఓట్లు.. వారి వారి బలం ఉంటుంది. కానీ కలిసి వెళ్తే మరింత బలంగా పోరాడవచ్చు. ఉనికి చాటుకోవడానికి పార్టీ పెట్టలేదు. లోతుగా ఆలోచించే గతంలో టీడీపీకి సపోర్ట్ చేశాను.
వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను.’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version