పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో హైడ్రామా. తాజాగా పంజాబ్ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ పదవికి నవజ్యోత్ సింగ్ రాజీనామా చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీకి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా లేఖ పంపారు. పదవి చేపట్టిన 72 రోజులకే నవజ్యోత్ సింగ్ సిద్ధూ… పంజాబ్ పిసిసి చీఫ్ పదవికి రాజీనామా చేశారు. దీంతో పంజాబ్ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
అయితే రాజీనామా చేసిన అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నవజ్యోత్ సింగ్ సిద్ధూ. పంజాబ్ సంక్షోభం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తన వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేస్తున్నట్లు చెప్పిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ… తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఇటీవల నవజ్యోత్ సింగ్ సిద్ధూ పై మాజీ సీఎం అమరేందర్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉండగా.. మాజీ సీఎం కాంగ్రెస్ నేత అమరీందర్ సింగ్, బీజేపీ నేత కేంద్ర హోం శాఖా మంత్రి, అధ్యక్షుడు జేపీ నడ్డాలతో భేటీ కాబోతున్నారని ఉదయం నుంచి ప్రచారం సాగుతోంది.