ఎట్టకేలకు నయన్-విఘ్నేష్ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఎరుపు రంగు కాస్ట్యూమ్స్, యాంటిక్ జ్యువెలరీలో నయనతార ఆకట్టుకోగా.. విఘ్నేష్ శివన్ వెడ్డింగ్ డ్రెస్లో మెరిసిపోయాడు. ఈ రోజు ఉదయం మహాబలిపురంలోని ఓ హోటల్లో వీరిద్దరి వివాహం ఎంతో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు సూపర్ స్టార్ రజినీకాంత్, షారుఖ్ ఖాన్, కార్తీ, విజయ్ దళపతి, డైరెక్టర్ అట్లి, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ తదితరులు హాజరై.. నూతన వధువరులను ఆశీర్వదించారు.
తాజాగా నయన్-విఘ్నేష్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాస్తవానికి వీరిద్దరు తమ వివాహ వేడుకను తిరుమల సన్నిధిలో చేసుకోవాలని అనుకున్నారు. కానీ, కొన్ని కారణాల వల్ల పెళ్లి వేదికను మహాబలిపురానికి మార్చారు. బాజా భజంత్రీల మధ్య పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. దీంతో కెరీర్ పరంగా ఎన్నో విజయాలు సాధించిన నయనతార.. పెళ్లి బంధంతో మరో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధమైంది.