ఛమ్‌కీలా అంగీలేసి పాటకు నాని వైఫ్ స్టెప్పులు

-

మరో వారంలోగా నాని దసరా మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. ఈ క్రమంలో నాని, కీర్తిసురేశ్ లు సినిమా ప్రమోషన్లలో బిజీబిజీగా ఉన్నారు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు ప్రమోషన్స్ కూడా ఆ స్థాయిలోనే ఉన్నాయి. ఈ మూవీలోని చమ్కీల అంగీలేసి అనే పాట యూట్యూబ్ లో ఫుల్ ట్రెండ్ అవుతోంది. ఈ పాటపై ఇప్పడికే చాలా మీమ్స్, రీల్స్ వచ్చాయి.

తాజాగా ఈ పాటపై నాని సతీమణి అంజన ఎలవర్తి, హీరోయిన్ నజ్రియా స్టెప్పులేశారు. క్యూట్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో కూల్ గా కూర్చొని హమ్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఛమ్కీల అంగీలేసి ఓ వదినే పాట నెట్టింట వ్యూస్ పంట పండిస్తోంది. కాసర్ల శ్యామ్ ఈ పాటను రాశారు. సంతోశ్ నారాయణన్‌ కంపోజిషన్‌లో రామ్‌ మిర్యాల, DHEE పాడారు. ఈ పాటకు పాపులర్‌ కొరియోగ్రఫర్‌ రక్షిత్‌ శెట్టి నృత్యరీతులు సమకూర్చారు. ప

క్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న దసరా చిత్రానికి శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. సాయికుమార్, స‌ముద్రఖని, జ‌రీనా వ‌హ‌బ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దసరా మూవీ మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా తెలుగు,తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version