సర్జరీ చేస్తుండగా కరెంట్‌ పోయింది.. రోగి ప్రాణం..

-

ఈ మధ్య సర్జీలు చేస్తూ..డాక్టర్స్‌ గొడవ పడిన ఘటన ఒకటి తెగ వైరల్‌ అయింది..అది చూసి.. అసలు డాక్టర్స్‌ ఇలా ఉంటారా అనుకున్నాం.. మళ్లీ ఇప్పుడు ఇంకో ఘటన జరిగింది.. ఇది చూస్తే.. డాక్టర్స్‌ ఇలా ఉండాలి అనుకుంటారు.. సర్జరీ చేస్తుండగా.. భూకంపం వచ్చింది. కరెంట్‌ పోయింది.. ఆ తర్వాత డాక్టర్స్‌ ఏం చేశారంటే..

జమ్మూ కశ్మీర్‌ అనంతనాగ్‌లో మంగళవారం స్వల్ప భూకంపం సంభవించింది. సుమారు 40సెకన్లు అంటే నిమిషం వరకు ప్రకంపనలు సంభవించాయి. అదే సమయంలో బిజ్బిహారాలోని ఉప జిల్లా ఆసుపత్రిలో వైద్యులు ఓ పేషెంట్‌కి ఆపరేషన్ ప్రారంభించారు. ఆపరేషన్ మధ్యలో ఉండగానే కరెంట్ పోవడంతో వైద్యులు షాక్ అయ్యారు. అయితే ఆందోళన చెందకుండా పారామెడికల్ సిబ్బంది సహాయ, సహకారాలు తీసుకున్నారు. బెడ్‌ మీద ఉన్న పేషెంట్‌ ప్రాణాలను ఎలా అయినా కాపాడాలి అనుకున్నారు..!

సర్జరీ అంటేనే ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుంటారు.. రోగికి, వారి బంధువులకు భయం భయంగానే ఉంటుంది. అలాంటిది.. సరిగ్గా సర్జరీ చేసే టైంలోనే కరెంట్‌ పోవడం అంటే వినడానికి చిన్న విషయంలా ఉన్నా..రియల్‌ స్విచ్ఛువేషన్‌ ఊహించుకోండి..అస్సలు చిన్న విషయం కాదు. ఎవరికైనా వెంటనే భయం, ఆందోళన వేస్తుంది. జమ్మూకశ్మీర్లోని బిజ్బిహారాలోని జిల్లా ఆసుపత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. భూకంపం వచ్చి నిమిషం పాటు కరెంట్ పోయిన సమయంలో ఆపరేషన్‌ థియేటర్‌లో వైద్యులు రోగికి ఎలాంటి వైద్యం అందించారో తెలియజెప్పేందుకు వీడియో తీశారు. ఇప్పుడు ఆ వీడియోనే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అఫ్గనిస్తాన్‌లోని హిందూకుష్ ప్రాంతానికి ఆగ్నేయంగా 40కిలో మీటర్లు దాదాపు 190కిలో మీటర్ల లోతులో భూమి కంపించిందని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వీస్‌ అంచనా ప్రకారం.. అక్కడ భూకంప తీవ్రత 6.5గా నమోదైంది. దాని ప్రభావం కారణంగానే బిజ్బిహారా జిల్లా ఆసుపత్రిలో రోగికి వైద్యం చేసిన తీరును సీఎంవో అధికారులు సైతం అభినందించారు. బలమైన భూకంపం వచ్చినప్పటికీ, వైద్యులు, పారామెడిక్స్ బృందం ధైర్యం సమతుల్యతను కోల్పోకుండా శస్త్రచికిత్సను కొనసాగించారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version