NC22 : చైతూ కోసం రంగంలోకి సీనియర్ హీరోయిన్

-

NC22 : సమంతతో విడాకులు తీసుకున్న అనంతరం నుంచి..నాగ చైతన్య వరుసగా సినిమాలతో దూసుకుపోతున్నాడు. కథ మరియు కథాంశంలో చాలా భిన్నంగా నాగ చైతన్య వరుసగా సినిమాలు చేస్తూ… ముందుకు సాగుతున్నారు. ఇందులో NC 22 పేరుతో ప్రస్తుతం వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య సినిమా చేస్తున్నాడు.


ఈ సినిమా షూటింగ్‌ ఇంకా ప్రారంభం కాకపోయినా.. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్‌ గా నటిస్తోన్నట్లు ఇప్పటికే చిత్ర బృందం రివీల్‌ చేసింది. ఇప్పటికే ఈ జంట బంగార్రాజు సినిమాలో మెరిసిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ అదిరిపోయే అప్డేట్‌ ఇచ్చింది చిత్ర బృందం. ఈ సినిమాలో ప్రియమణీ నటిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది చిత్ర బృందం. ఈ మేరకు ప్రియమణి పోస్టర్‌ ను రిలీజ్‌ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version