విద్యార్థులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూంటారు.అయితే ఎలా ప్రిపేర్ అయితే మంచి మార్కులు వస్తాయి అనే విషయం పై సరైన అవగాహన లేకపోవడంతో క్వాలిఫై అవ్వలేక పోతారు.ముఖ్యంగా నీట్, జేఈఈ వంటి ఎగ్జామ్స్ కు సరిగ్గా ప్రిపేర్ అవ్వక ఫెయిల్ అవుతారు.ఈ పరీక్షల్లొ రానినించాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలని ప్రముఖులు అంటున్నారు.. దాని గురించి పూర్తీ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..ర్యాంకును నిర్ణయించే కీలకమైన సబెక్టుల్లో కెమిస్ట్రీ ఒకటి. ఇతర సబెక్టులతో పోల్చితే కెమిస్ట్రీలోమంచి స్కోర్ చేయడం చాలా సులభం. ఇందులో ఎక్కువగా మెమరీ ఆధారిత ప్రశ్నలే ఉంటాయి.
NCERT సిలబస్ నుంచి ఈ రకం ప్రశ్నలు అడుగుతుంటారు. నీట్, జేఈఈ పరీక్షల కోసం ఎన్సీఈఆర్టీలోని అన్ని చాప్టర్లు ప్రిపేర్ కావాల్సిందే. అయితే కొన్ని అతి ముఖ్యమైన చాప్టర్లు ఉన్నాయి.వాటి పై పూర్తీ అవగాహన రావాలి అని ఏంటంటే..
ఫిజికల్ కెమిస్ట్రీ,ఆర్గానిక్ కెమిస్ట్రీ,ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ,టై బ్రేకర్ పాలసీ..
ఈక్విలిబ్రియం, థర్మోడైనమిక్స్, కెమికల్ కైనటిక్స్, ఎలెక్ట్రోకెమిస్ట్రీ ఫిజికల్ కెమిస్ట్రీలో అతి ముఖ్యమైన చాప్టర్లు. దీంతో వీటిని తరవుగా ప్రిపేర్ అవ్వాలి. వీటి నుంచి న్యూమరికల్ వ్యాల్యూ సంబంధిత ప్రశ్నలతో పాటు సింగిల్ చాయిస్ కరెంట్ MCQ ప్రశ్నలు ఎక్కువగా అడిగే అవకాశం ఉంది.అందుకే వీటి పై ఎక్కువగా ఫోకస్ పెట్టాలి..
రియాక్షన్ అండ్ మెకానిజం ఆఫ్ ఆర్గానిక్ రియాక్షన్, క్వశన్స్ ఆన్ నోమన్క్లేచర్, ఎలక్ట్రానిక్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్స్, కన్వర్షన్స్, నేమ్ రియాక్షన్ నుంచి ఎక్కువగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అలాగే GOC అండ్ కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ కార్బోనల్ కాంపౌండ్స్, అమినస్, ఆల్కహాల్ కూడా కొన్ని ముఖ్యమైన టాఫిక్స్. వీటి నుంచి కూడా తరచుగా ప్రశ్నలు వస్తుంటాయి. బయోమాలిక్యూల్స్, కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీ డే లైఫ్, పాలిమర్ల వంటి చాప్టర్లను కూడా విస్మరించకూడదు. ఎందుకంటే ఈ అంశాల నుంచి కూడా కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి
సమ్మేళనాలు, లక్షణాలు, పోకడలు ఉంటాయి. విద్యార్థులు సరైన కారణాలతో వీటిని అర్థం చేసుకోవాలి. కెమిస్ట్రీకి చెందిన ఎస్సీఈర్టీ సిలబస్‌పై ఇంటెన్సివ్, ప్లాన్డ్ రీడింగ్‌తో ఉండాలి. అలాగే NCERT ఉదాహరణ నుండి ప్రశ్నలను సాల్వ్ చేయడాన్ని ప్రాక్టీస్ చేస్తుండాలి. పి-బ్లాక్, డి-బ్లాక్ వంటి చాప్టర్లకు ట్రెండ్లను నేర్చుకోవడం కూడా ముఖ్యమే. అలాగే మంచి స్కోర్ చేయడానికి కోఆర్డినేషన్ కాంపౌండ్‌లోని కాన్సెప్ట్‌లను పూర్తిగా అవగాహన పెంచుకోవాలి..గ్రాప్ లు మొదలగు వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి.
టైబ్రేకర్ ప్రక్రియ కోసం జీవశాస్త్రంలో ఎక్కువ పర్సంటైల్ స్కోర్ పొందిన అభ్యర్థులకు అదే మొత్తం మార్కులు వచ్చిన ఇతర అభ్యర్థుల కంటే ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అప్పటికీ టై కొనసాగితే, కెమిస్ట్రీలో ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులు ఉన్నత ర్యాంక్ పొందుతారు…వీటి పై ఫోకస్ పెట్టి ప్రీపెర్ అయితే మంచి మార్కులను సాధించవచ్చు.. ఇది గుర్తుంచుకోని ప్రిపేర్ అవ్వండి..మంచి మార్కులను సాధించండి..