కోటి రూపాయల ఎడ్యుకేషన్ లోన్ కావాలా…? అయితే చాలా ఈజీ…!

-

ఉన్నత విద్యా సంస్థల్లో చదువుకునే వారికి ఆర్ధికంగా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. వారు చాలా వరకు కూడా చదువుకోవడానికి డబ్బులు లేకనే చదువు ఆపేస్తూ ఉంటారు. చాలా వరకు ఇప్పుడు ప్రముఖ బ్యాంకు లు అన్నీ కూడా విద్యార్ధులకు లోన్లు అందిస్తున్నాయి. తాజాగా ఐసీఐసీఐ బ్యాంక్ రూ.1 కోటివరకు ఎడ్యుకేషన్ లోన్ విద్యార్ధులకు అందించడానికి ముందుకు వచ్చింది.

విదేశాల్లో చదువుకోవాలి అని భావించే వారికి గానూ ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అని బ్యాంకు చెప్పింది. లోన్ కోసం కూడా పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇన్‌స్టా ఎడ్యుకేషన్ లోన్ ద్వారా లోన్ ని చాలా ఫాస్ట్ గా అందిస్తుంది బ్యాంకు. లక్షలాది మంది కస్టమర్లకు ప్రీ-అప్రూవ్డ్ ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకోవాలి అని సూచిస్తుంది. లోన్ ప్రాసెస్ మొత్తం డిజిటల్ పద్ధతిలోనే ఉంటుంది. రూ.1 కోటి వరకు లోన్ సాంక్షన్ లెటర్‌ను ఏ మాత్రం ఆలస్యం లేకుండా ఇచ్చేస్తుంది. ఈ లెటర్ తో వారు కాలేజిలో జాయిన్ అవ్వొచ్చు. భారత్ లో చదివే వారికి 50 లక్షల వరకు వస్తుంది. 10 ఏళ్ళలో తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version