మాస్టర్ మహేంద్రన్ హీరోగా యాశ్న ముత్తులూరి నేహా పఠాన్ హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘నీలకంఠ’ రాకేష్ మాధవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సీనియర్ నటులు రాంకీ బబ్లూ పృథ్వీ, శుభలేఖ సుధాకర్, చిత్రం శీను, సత్య ప్రకాష్, అకాండ శివ, భరత్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మరో ప్రత్యేక ఆకర్షణగా, చాలా సంవత్సరాల తర్వాత నటి స్నేహా ఉల్లాల్ ఓ ప్రత్యేక గీతంలో కనిపించనున్నారు. ఈ సినిమాను L S ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మర్లపల్లి శ్రీనివాసులు దివి వేణుగోపాల్ సంయుక్తంగా నిర్మించగా అనిల్ ఇనుమడుగు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు.ఇక ‘నీలకంఠ’ చిత్రం జనవరి 2, 2026న ఘనంగా ప్రేక్షకుల ముందుకు రానుండగా విడుదలకు ఒక రోజు ముందే మేకర్స్ ప్రీమియర్స్ ప్రదర్శనలు నిర్వహించారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూద్దాం..
మూవీ కథ : నీలకంఠ’ ఒక పీరియాడిక్ రూరల్ డ్రామా. సరస్వతిపురం అనే గ్రామం కట్టుబాట్లు సంప్రదాయాలకు ప్రాణం పెట్టే ఊరు. అక్కడ ఎవరైనా తప్పు చేస్తే శిక్ష విధించే అధికారం గ్రామ పెద్దలదే ఆ శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయంటే జీవితం దిశనే మార్చేస్తాయి. అలాంటి ఊరిలో టైలర్ వృత్తి చేసుకునే నాగభూషణం కుమారుడు నీలకంఠ.
చదువులో ముందుండే విద్యార్థి. కానీ 10వ తరగతి చదువుతున్న సమయంలో చేసిన ఒక చిన్న తప్పుకు 15 సంవత్సరాలు ఊరు దాటకూడదు, ఇకపై చదువుకోవడానికి అవకాశం లేదని గ్రామ పెద్దలు తీర్పు చెబుతారు. ఆ ఒక్క నిర్ణయం నీలకంఠ కలల్ని చిదిమేస్తుంది. అదే సమయంలో నీలకంఠకు సీతపై ప్రేమ కలుగుతుంది. ఆమె ఆ ఊరి సర్పంచ్ కూతురు. చదువుల కోసం సీత ఊరు విడిచి వెళ్లిపోతుంది. “బాగా చదువుకుని ఊరికి పేరు తెస్తా” అని చిన్నతనంలో అమ్మకు ఇచ్చిన మాటను నెరవేర్చలేకపోతున్నానన్న బాధ నీలకంఠను లోపల్నుంచి కాల్చేస్తుంది. సరస్వతిపురంలో కబడ్డీ ఆటకు ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది.

చదువుకు దూరమైన నీలకంఠ, జీవితాన్ని కబడ్డీ వైపు మలుపుతిప్పుతాడు. ఊరిలో జరిగే ప్రతి కబడ్డీ పోటీలో గెలుస్తాడు. కానీ ఊరు దాటే హక్కు లేకపోవడంతో, మండల స్థాయి పోటీల్లో పాల్గొనలేకపోతాడు. నీలకంఠ లేకుండా సరస్వతిపురం కబడ్డీ జట్టు ప్రతిసారి ఓటమినే ఎదుర్కుంటుంది. ఇవన్నీ చూసిన సర్పంచ్, సీతకు పెళ్లి చేయాలని నిర్ణయిస్తాడు. అప్పుడే నీలకంఠ ఒక సంచలన నిర్ణయం తీసుకుంటాడు. “మీరు గౌరవంగా భావించే అదే సర్పంచ్ పదవికి పోటీ చేసి, గెలిచి సీతను పెళ్లి చేసుకుంటా” అంటూ సవాల్ విసురుతాడు.దొంగగా, తప్పుదారి పట్టిన వాడిగా చూసిన గ్రామ ప్రజలు నీలకంఠను సర్పంచ్‌గా గెలిపిస్తారా? సరస్వతిపురాన్ని మండల స్థాయి కబడ్డీ పోటీల్లో ఎలా విజేతగా నిలబెట్టాడు? అమ్మకు ఇచ్చిన మాటను నీలకంఠ చివరకు ఎలా నిలబెట్టుకున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ‘నీలకంఠ’ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ : ‘నీలకంఠ’ సినిమాకు ప్రధాన బలం దాని కోర్ పాయింట్. ఇప్పటివరకు మనం చూసిన గ్రామ కథల్లో తప్పు చేస్తే ఊరి నుంచి వెలివేయడం సాధారణంగా చూపిస్తారు. కానీ ఈ చిత్రంలో దర్శకుడు కొత్త కోణాన్ని ఎంచుకున్నాడు. చేసిన తప్పుకు ఊరు విడిచి వెళ్లకుండా, ఆ వ్యక్తికి అత్యంత ఇష్టమైనదాన్నే దూరం చేయడం అనే కాన్సెప్ట్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నాన్-లీనియర్ స్క్రీన్‌ప్లేలో కథ ప్రారంభమవడం వల్ల తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ చివరి వరకూ ఆడియన్స్‌ను స్క్రీన్‌కు కట్టిపడేస్తుంది.
ఈ చిత్రంలో మెయిన్ లీడ్‌గా నటించిన మాస్టర్ మహేంద్రన్ చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అతని స్క్రీన్ ప్రెజెన్స్ బాగుండటమే కాకుండా తన క్యారెక్టర్‌తో ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా ప్రతి సీన్‌లో గట్టి ప్రయత్నం చేసినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్‌లో అనుభవం ఉన్న నటుడిలా మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ చూపించాడు..
ప్లస్ పాయింట్స్ : మాస్టర్ మహేంద్రన్ నటన
కథ, దర్శకత్వం
విజువల్స్, ఎడిటింగ్
మైనస్ పాయింట్స్ : సెకండ్ ఆఫ్, మ్యూజిక్
