నీరజ్ చోప్రాకు పెరిగిన ఫాలోవర్స్.. ఎంతకీ రీచ్ అయ్యారంటే?

-

జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన భారత అథ్లెట్‌ నీరజ్‌ చోప్రాపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తుంది. జావెలిన్‌ త్రో ఫైనల్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నీరజ్‌ చోప్రాను చూసి భారతీయులంతా గర్వపడుతున్నారు. ఫస్ట్ అటెంప్ట్‌లోనే డైరెక్ట్ ఫైనల్స్‌లోకి వెళ్లిన నీరజ్ చోప్రా ఎంతో శ్రమించి భారత మువ్వన్నెల పతాకాన్ని ప్రపంచ పటంపై ఎగురవేశాడని కీర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పెరిగిపోతున్నారు.

ఇన్ స్టా గ్రామ్‌లో నీరజ్ చోప్రాకు ప్రజెంట్ 1.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇండియా మొత్తం ఆయన్ను లెజెండ్‌గా కీర్తిస్తున్నది. ఈ క్రమంలోనే కేవలం ఆరు గంటల్లోనే 1.4 మిలియన్ ఫాలోవర్స్ వచ్చారు. ఫ్యూచర్‌లో ఫాలోవర్స్ ఇంకా పెరిగే చాన్సెస్ పుష్కలంగా ఉన్నాయి. సోషల్ మీడియా వేదికగా ఒలింపిక్స్‌కు సంబంధించిన నీరజ్ చోప్రా వీడియోను షేర్ చేస్తూ నెటిజనాలు ఆయన్ను ట్రెండ్ చేస్తున్నారు. గోల్డెన్ నీరజ్ అంటూ బోలెడన్ని పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్త మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్స్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా వాల్యుబుల్ గిఫ్ట్‌ను నీరజ్ చోప్రాకు అందిచబోతున్నారు.

మహీంద్రా కంపెనీ త్వరలో లాంచ్ చేయబోయే ఎక్స్‌యూవీ 700ను గిఫ్ట్‌గా ఇవ్వబోతున్నారు. మొత్తంగా ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండానే ఒలింపిక్స్‌కు వెళ్లిన నీరజ్ చోప్రా భారత్ తరఫున ఆడి గోల్డ్ మెడల్ సాధించడం పట్ల యావత్ దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సామాన్యుల నుంచి మొదలుకుని ప్రముఖుల వరకు ప్రతీ ఒక్కరు గర్వంగా ఫీలవుతున్నారు. జావెలిన్ త్రీ క్రీడాంశంలో వీరుడు నీరజ్ చోప్రా అని క్రీడాభిమానులు కొనియాడుతున్నారు. కఠినమైన క్రమశిక్షణ, హార్డ్ వర్క్ వల్లే నీరజ్ చోప్రా విజయం సాధించగలిగాడని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version