ఎన్‌టీఏ ఈసారి కూడా నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ (నీట్)ని నిర్వహిస్తుంది. ఈ పరీక్షతో ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర వైద్య, సైన్స్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. డిగ్రీస్థాయి కోర్సుల ప్రవేశాల కోసం జాతీయస్థాయిలో నీట్‌ను నిర్వహిస్తారు. రాష్ట్రంలో వైద్య కళాశాల లతోపాటు దేశంలోని ఇతర కాలేజీల్లో కూడా నీట్ ర్యాంక్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(neet) తేదీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిన్న పొద్దుపోయాక ప్రకటించింది.
ఆ ప్రకటన ప్రకారం ఆగస్టు ఒకటో తేదీన పరీక్ష జరగనుంది. మొత్తం 11 భాషల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. అలాగే ఆఫ్ లైన్ లోనే ఈ పరీక్ష ఉండనుంది. అంటే పెన్ పేపర్ తో పరీక్ష నిర్వహించనున్నారు. మిగతా డీటెయిల్స్ అన్ని త్వరలో ప్రకటించిన వెబ్సైట్ లో అందుబాటులో ఉంచనున్నారు. ఇక MBBS, BDS, BAMS, BSMS, BUMS , BHMS కోర్సుల్లో ప్రవేశాల కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తోంది.