తమిళనాడు లోని కోయంబత్తూరు లో ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యం లో అంగరంగ వైభవంగా మహా శివరాత్రి వేడుకలు జరిగాయి. ఇలా అక్కడ జరిగిన కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమం లో సెలబ్రెటీస్ పాల్గొనడం విశేషం. అక్కడకి వచ్చిన జనం, భక్తులు ఆకర్షితులయ్యారు.
అలానే సద్గురు కూడా నటరాజ నృత్యాలు చేస్తూ వారి లో మరింత ఉత్సాహం తీసుకు రావడం జరిగింది. అక్కడ జరిగిన ఈ దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అయి పోయాయి. తెలంగాణ యాస తో ఆట పాటల తో తెలుగు రాష్ట్రాల్లో అభిమానులను సంపాదించున్న మంగ్లీ తాజాగా వచ్చిన సారంగదరియా సాంగ్ తో మరెంత పాపులర్ అయి పోయింది. సంగీత ప్రేక్షకులను మరోసారి ఉత్సహపరిచింది ఈమె. సమంత, రకుల్, మంచు లక్ష్మి కూడా కోయంబత్తూరు విచ్చేసారు.