ఏపీలో భారీ వర్షాలు : రెండు రోజులు పాఠశాలలకు సెలవులు !

-

బంగాళాఖాతం లో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని నేపథ్యంలో అన్ని శాఖలు అప్రమత్తంగా… ఎలాంటి విపత్తులు వచ్చినా ఎదుర్కొనే విధంగా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నెల్లూరు జిల్లాలో భారీ వర్షపాతం నమోదైందని… ముఖ్యంగా శ్రీహరికోట, తడ అలాగే సూళ్లూరుపేట లో అధికంగా వర్షపాతం నమోదైందని ఆయన స్పష్టం చేశారు.

అన్ని మండలాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయడంతోపాటు కమాండ్ కంట్రోల్ రూం నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్న ట్లు వెల్లడించారు కలెక్టర్. ముఖ్యంగా తీరప్రాంత మండల అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు అవసరమైన ముందస్తు చర్యలు చేసినట్లు పేర్కొన్నారు. నెల్లూర్ జిల్లాలోని పాఠశాలలకు, కళాశాలలకు రెండురోజులు సెలవు ప్రకటించడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు.

లోతట్టు ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టడం జరిగిందని, 1077 టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. ప్రజలు సహాయం కోసం 1077 టోల్ ఫ్రీ నంబరును సంప్రదించ వచ్చునని జిల్లా కలెక్టర్ వివరించారు. ముఖ్యంగా విద్యుత్ అంతరాయం కలగకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ వివరించారు. సోమశిల రిజర్వాయర్ కు వరద కొనసాగుతోందని,పెరుగుతున్న ఇన్ ఫ్లో కారణంగా ఔట్ ఫ్లో కూడా పెంచుతున్నట్లు కలెక్టర్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version