ఎదుటి వారికి చెప్పేందుకు ఎన్నైన చెబుతాం మనం అచారించాలా ఏంటి..ఇలా ఉంది నెల్లూరుజిల్లాలో మంత్రి అనిల్ వ్యవహారం.అధికార,ప్రతిపక్ష పార్టీ నేతలు ఎవరి ఫ్లెక్సీలు పెట్టినాఅ మొన్నటిదాకా నో ప్లైక్సీలంటూ రచ్చచేసిన మంత్రి ..అధినేత పర్యటనతో అవన్నీ తూచ్ అంటూ పక్కన పెట్టేశారు. సీఎం జగన్ నెల్లూరు పర్యటనలో ఫ్లెక్సీ తోరలతో నగరాన్ని నింపేశారు..దీంతో అనిల్ కి నెల్లూరు రాజకీయాలు బాగానే వంటబట్టాయని స్వపక్ష నేతలు.. విపక్ష నేతలు ఫైర్ అవుతున్నారట…
నెల్లూరు నగరంలో ఫ్లెక్సీల రగడ ప్రస్తుతం వాడీవేడిగా మారింది. ఇష్టారాజ్యంగా వాటిని ఏర్పాటు చేయడంపై నిషేధం విధిస్తూ మంత్రి అనిల్ గతంలో నిర్ణయం తీసుకున్నారు. ఆ క్రమంలోనే పలు సందర్భాల్లో కార్పొరేషన్ సిబ్బంది ఎవరు ఏర్పాటు చేసినా తొలగిస్తూ వచ్చారు. ఇటీవల పీవీ నరసింహారావు వర్ధంతి, ఆనం వివేకానందరెడ్డి జయంతి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నెల్లూరు పర్యటన సమయంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయగా.. పాలక సిబ్బంది తొలగించడం వివాదాస్పదమైంది. ఓ దశలో ఆనం కుటుంబ సభ్యులు తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆనం రామనారాయణరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల మాకుటుంబం సత్తా చూపిస్తామని ప్రెస్ మీట్ పెట్టిమరి చెప్పడం సింహపూరిలో రాజకీయ వేడిని రాజేసింది..
ఇక అక్కడితో ఆగకుండా పీవీ నరసింహారావు చిత్రపటానికి అభిమానులు పాలాభిషేకం చేసి నిరసన వ్యక్తం చేసిన పరిస్థితులు ఉన్నాయి. వైఎస్ వివేకానందరెడ్డి మరణంతో ఆనం కుటుంబం నగరానికి దూరమైందని భావించడం సరైంది కాదన్నారు. నగరంలోని ప్రతి కుటుంబంలోనూ తమ అభిమానులున్నారని ఆయన చెప్పారు.అటు బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటనలోను ఇదే పరిస్థితి నెలకోంది. అయితే సిఎం నెల్లూరు జిల్లా పర్యటనలో ఈ నిబంధనలను బ్రేక్ చేసి నగరాన్ని ఫ్లెక్సీలతో నింపారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. నేతలు పోటీ పడి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై ప్రతిపక్ష పార్టీ నేతలు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇక సోంత పార్టీలోని ఆనం వర్గీయులు ఈ విషయంపై చర్చించుకున్నరంటా…ఆ రోజు కావాలనే ఆనం వివేకానందరెడ్డి ప్లైక్సిలను తొలగించారని…ఇప్పుడు మాత్రం అధినేత ప్రసన్నం కోసం మంత్రులు ఇద్దరు నగరంలో మొత్తం బ్యానర్‌లతో నింపేశారని జగన్ పర్యటన సమయంలో చర్చించుకోవడం గమనార్హం ..ఇక ప్రతిపక్ష పార్టీలు మీకో న్యాయం మాకో న్యాయమా అని ఆందోళనలకు సిద్దమవుతున్నారట. సింహపురి ఫ్లెక్సీ రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.