“పంచతంత్ర కథలు” మూవీ నుంచి అదిరిపోయే సాంగ్‌ రిలీజ్‌

-

విభిన్న కథాంశంతో వస్తున్న చిత్రం “పంచతంత్ర కథలు”. M/s. మధు క్రియేషన్స్ ప్రొడక్షన్‌ హౌస్‌ ఆధ్వర్యంలో.. నిర్మాత డి మధు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాకు గంగనమోని శేఖర్ రచయిత & దర్శకుడుగా వ్యవహరిస్తుండగా.. సహ నిర్మాత డి.రవీందర్, గంగనమోని శేఖర్, విజయ్ భాస్కర్ సద్దాలలు సినిమాటోగ్రఫీగా ఉన్నారు.

నోయెల్, నందిని రాయ్, సాయి రోనక్, ప్రణీత పట్నాయక్, నిహాల్ కొదటి, సదియా, అజయ్ కతుర్వార్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే.. ఈ సినిమాకు కమ్రాన్ సంగీత స్వరాలు అందిస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాకు “అజర్ షేక్” డైలాగ్స్ మరియు లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. పూర్వ అనుభవంతో.. ఆయన ఈ ప్రాజెక్ట్‌ పై ఫోకస్‌ పెట్టారు.

ఇది ఇలా ఉండగా.. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్‌ ను వదిలింది చిత్ర బృందం. ఈ సినిమా “మోతేబరి సాంగ్”ను వదిలింది చిత్ర బృందం. ఈ పాటను రామ్ మిరియాల పాడటం.. సినిమాకే హైలెట్‌ గా నిలిచింది. అటు ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. ఇక ఈ పాట విషయానికి వస్తే.. రామ్ మిరియాల…తన స్వరాలతో.. శ్రోతలను ఆకట్టుకున్నాడు. అటు బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ కూడా అదిరిపోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version