ఢిల్లీలో కొనసాగుతున్న రైతుల ఆందోళనలపై అంతర్జాతీయ పాప్ స్టార్ రిహానాతోపాటు పలువురు ఇతర విదేశీ సెలబ్రిటీలు ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. అలాగే పలువురు క్రికెటర్లు కూడా ఈ విషయం పట్ల స్పందించారు. ఇది భారత్ అంతర్గత వ్యవహారమని, ఇందులో విదేశీయుల ప్రమేయం అవసరం లేదని ట్వీట్లు చేశారు. అయితే అందరికన్నా సచిన్ చేసిన ట్వీట్ అందరినీ ఆకర్షిస్తోంది. ఈ క్రమంలోనే క్రికెట్ దేవుడిగా పేరుగాంచిన ఆయనను నెటిజన్లు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.
రైతుల ఆందోళనలపై విదేశీ సెలబ్రిటీలు ట్వీట్లు చేయడంపై సచిన్ స్పందించాడు. వారికి చురకలు అంటించేలా ట్వీట్ చేశాడు. అంతేకాదు, నిజమైన దేశభక్తిని పెంపొందించే విధంగా ఆయన ట్వీట్ చేశాడు. దీంతో ఆయన ట్వీట్‌కు నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ప్రస్తుతం ట్విట్టర్‌లో సచిన్ ట్రెండ్ అవుతున్నారు.
India’s sovereignty cannot be compromised. External forces can be spectators but not participants.
Indians know India and should decide for India. Let's remain united as a nation.#IndiaTogether #IndiaAgainstPropaganda— Sachin Tendulkar (@sachin_rt) February 3, 2021
భారతీయ సార్వభౌమత్వం కోసం ఎలాంటి రాజీ పడేది లేదని, విదేశీ శక్తులన్నీ దీనికి దూరంగా ఉండాలని, భారతీయ ప్రజలకు తమ దేశం గురించి తమకు తెలుసని, భారతదేశం కోసం, భవిష్యత్తు కోసం భారతీయులు ఓ మంచి నిర్ణయమే తీసుకుంటారని సచిన్ ట్వీట్ చేశాడు. దేశభక్తిని పెంపొందించే విధంగా ఈ ట్వీట్ ఉందంటూ అభిమానులు సచిన్‌పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇతర క్రికెటర్లు కూడా సరిగ్గా ఇలాగే అర్థం వచ్చేలా ట్వీట్లు చేశారు కానీ సచిన్ ట్వీట్ ప్రత్యేకంగా వైరల్ అవుతోంది.
That's why Sachin is my favourite and will always be….he is indeed a true INDIAN ❤️#IndiaAgainstPropaganda #IndiaWithModi #Sachin https://t.co/6uFYiPpWGz
— Prastuti Shaw (@ShawPrastuti) February 3, 2021
तुम्हाला मानले सर मी well done sir.
He knows how to bat and how to defend match by doing good fielding.#IndiaAgainstPropaganda #sachin#IndiaTogether— Umesh (@Umesh35318788) February 3, 2021
That's a sixer. Well done #Sachin https://t.co/WE5Hat10aG
— niraj kumar (@jha_nrj) February 3, 2021