ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన లీడ్స్ టెస్టు మ్యాచ్‌లో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 78 పరుగులు మాత్రమే చేసి పరువు పోగొట్టుకుంది. అయితే సరిగ్గా అలాంటి అనుభవమే ఇప్పుడు న్యూజిలాండ్ జట్టుకు ఎదురైంది. బంగ్లాదేశ్ చేతిలో ఆ జట్టు దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. బంగ్లాదేశ్ స్పిన్నర్లకు న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ దాసోహం అయ్యారు.
బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఢాకాలో బుధవారం జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో కివీస్‌పై బంగ్లా జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ కేవలం 60 పరుగులకే ఆలౌట్ అయింది. బంగ్లా బౌలర్లలో స్పిన్నర్లయిన ముస్తాఫిజుర్ రహమాన్, మహమ్మద్ సైఫుద్దీన్, షకిబ్ అల్ హసన్, నసుమ్ అహ్మద్‌లు 9 వికెట్లను తీశారు. బంగ్లా స్పిన్నర్ల ఎదుట కివీస్ బ్యాట్స్‌మెన్ నిలబడలేకపోయారు. దీంతో కివీస్ తక్కువ స్కోరుకే చాప చుట్టేసింది.
Australia after watching their neighbours 52/8 in Bangladesh #BANvNZ pic.twitter.com/h1pKN1NKcp
— Shubh Aggarwal (@shubh_chintak) September 1, 2021
Aussies To NZ Team : #BANvNZ pic.twitter.com/TezIxKWsoY
— 𝗟𝗶𝗮𝗺 𝗟𝗶𝘃𝗶𝗻𝗴𝘀𝘁𝗼𝗻𝗲 𝗡𝗼𝘁𝗶𝗰𝗲𝗱 🤠 (@122mlongsix) September 1, 2021
అనంతరం బంగ్లా జట్టు 15 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసి మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. అయితే ఈ విధంగా కివీస్ ను బంగ్లా జట్టు చిత్తు చేయడంతో సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. నెటిజన్లు కివీస్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మరీ దారుణంగా ఓడిపోయారని కామెంట్లు చేస్తున్నారు.
Bangladesh on their home ground #BANvNZ pic.twitter.com/PODsTaTHtj
— 𝓢𝓮𝓱𝓻𝓲𝓼𝓱 🇵🇰 (@itsmeSehrish) September 1, 2021
WTF NEW ZEALAND 60 ALL OUT?????????
I guess the rivarly between aus and nz are getting strong by their lowest scores!!#BANvNZ pic.twitter.com/z4liwK9pFc
— Soham Mukhopadhyay 🇮🇳 (@SohamMukhopad14) September 1, 2021
అయితే కొందరు మాత్రం న్యూజిలాండ్ జట్టుకు మద్దతుగా నిలిచారు. బంగ్లా జట్టు కేవలం స్పిన్నర్లకు అనుకూలంగా ఉండే విధంగా పిచ్‌ను రూపొందించుకుందని, పిచ్‌లో నాణ్యత లేదని, ఈ విషయాన్ని ఐసీసీ పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు. ఏది ఏమైనా బంగ్లా మాత్రం చాలా హ్యాపీగా ఉంది.