బీరుకు దబాంగ్ పేరే ఎందుకు..వై నాట్ గబ్బర్ సింగ్ అంటూ నెటిజన్స్ సెటైర్లు

-

తెలంగాణలో కొత్త రకం బ్రాండ్ బీర్లు అందుబాటులోకి రాబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మార్కెట్లో కింగ్ ఫిషర్ బీర్ల కొరత ఏర్పడింది.ఈ క్రమంలోనే ప్రభుత్వం మార్కెట్లోకి కొత్త బీర్లను తీసుకొచ్చేందుకు సోమ్ డిస్టిలరీస్‌కు అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ప్రభుత్వం సోమ్ డిస్టిలరీస్‌తో పాటు మరో 3 కొత్త డిస్టిలరీస్‌కు కూడా అనుమతులు జారీ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.అయితే, ఆ కంపెనీలకు చెందిన బీర్ల పేర్లు మాత్రం చాలా విచిత్రంగా ఉన్నాయి. ఈ మేరకు అందులో మౌంట్ ఎవరెస్ట్,టాయిల్, ఎగ్జొటికా సంస్థలు ఉన్నాయి.

అందులో ఓ బ్రాండ్ పేరు దబాంగ్ కాగా.. మరో బ్రాండ్ పేరు లేమౌంట్ అని టాక్. ప్రస్తుతం అందుకు సంబంధించిన బీర్ల ఫొటోలు నెట్టింట్లా తెగ వైరల్ అవుతున్నాయి. ఆ బీర్లను చూసిన నెటిజన్లు ‘మద్యం అమ్మకాలు పదింతలు చేసి కేసీఆర్‌ పేరు మీద ఓ బ్రాండ్ తీసుకురావాలి’ కామెంట్ చేస్తుండగా మరికొందరు ‘బీరుకు దబాంగ్ పేరే ఎందుకు.. వై నాట్ గబ్బర్ సింగ్’ అని సోషల్ మీడియాలో ఓ రేంజ్ సెటైర్లు వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news