కరోనా ప్రబలుతోందని, ఇంటి పట్టునే ఉండంటూ ప్రభుత్వాలు నెత్తి నోరు కొట్టుకుని చెబుతున్నాయి. ఇలాంటి సమయంలో షాపింగ్ మాల్ ఓపెనింగ్ అంటూ యాంకర్ రష్మీ అందర్నీ ఆహ్వానించడంపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. అసలింతకీ ఏం జరిగిందో ఓసారి చూద్దాం.
రాజమండ్రిలో మార్చి 20న షాపింగ్ మాల్ ఓపెనింగ్స్‌కు వస్తున్నాను.. అందరం అక్కడ కలుద్దాం అంటూ సోషల్ మీడియాలో షేర్ చేసింది రష్మీ. ఇక ఈ ప్రకటనపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. కామన్ సెన్స్ ఉందా? బాధ్యత అనేది తెలుసా? కరోనాతో అందరూ భయపడుతుంటే షాపింగ్ మాల్ ఓపెనింగ్ అంటావా? ప్రజలను బయటకు రావొద్దని ప్రభుత్వాలు కోరుతుంటే.. ఇలా ఓపెనింగ్ అంటూ నువ్వు పిలుస్తావా? అంటూ రష్మీపై ఫైర్ అవుతున్నారు.
అయితే వీటికి రష్మీ సైతం ఘాటుగానే స్పందిస్తోంది. తనకు అంతిమ నిర్ణయం తీసుకునే అధికారం లేదని, ముందుగా ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం వెళ్లక తప్పదని తెలిపింది. అక్కడ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు అన్ని అనుమతులున్నాయని నిర్వాహకులు చెబుతున్నారని, రావాల్సిందేనని వారు పట్టుబట్టారని చెప్పుకొచ్చింది. కరోనా తనను చంపకపోవచ్చు.. కానీ లీగల్ నోటీసులు చంపేయవచ్చని కామెంట్స్ చేసింది.