‘ఫ్యామిలీ స్టార్’ ఫస్ట్ సాంగ్‌ షాంపూ యాడ్‌లా ఉందంటూ దారుణంగా ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు

-

పరశురాం దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’ . మృణాళ్ ఠాకూర్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తుంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు, శిరీష్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకొంటున్న ఈ మూవీ ఏప్రిల్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది.గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రం నుంచి సాంగ్ విడుదలైన సంగతి తెలిసిందే..ఏమిటిది చెప్పీ చెప్పనట్టుగా ఎంత చెప్పిందో, సూచనలు ఇచ్చీ ఇవ్వనట్టుగా ఎన్నెన్నిచ్చిందో’ అంటూ సాగే ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.హీరోయిన్ మృణాల్ ఇంకా విజయ్ మధ్య కెమిస్ట్రీ ఎంతో బాగుంది అంటూ టాక్ కూడా వచ్చింది.

ఇదిలా ఉంటే మీమర్స్ కి ఈ సాంగ్ మంచి స్టఫ్ లాగా మారింది. ఈ సాంగ్ పైన మీమర్స్ విపరీతమైన ట్రోలింగ్స్ చేస్తున్నారు.విజయ్ యాక్టింగ్ షాంపూ యాడ్‌లా ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు. అంతే కాదు ఒక షాంపో సాంగ్ ని అడ్ చేసి వివిధ రకాల మీమ్స్ క్రియేట్ ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news