కేటీఆర్‌కు కౌంట‌ర్ వేస్తున్న వేస్తున్న నెటిజ‌న్లు.. స‌మాధానం చెప్పని మంత్రి

-

ప్ర‌స్తుతం తెలంగాణ‌లో క‌రోనా ఏ స్థాయిలో అల్ల‌క‌ల్లోలం సృష్టిస్తుందో చూస్తూనే ఉన్నాం. ప్ర‌భుత్వం స‌రిగ్గా ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని ఎన్నోసార్లు ప్ర‌జ‌లు విమ‌ర్శ‌లు చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ సెగ కేటీఆర్ (KTR) కు త‌గిలింది. ఆయ‌న సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అంద‌రికీ తెలిసిందే. ఆయ‌న‌కు వ‌చ్చిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పే ప్ర‌య‌త్నం చేస్తారు కేటీఆర్‌.

 

అయితే ఇప్పుడు కేటీఆర్ నిర్వ‌హిస్తున్న ఆస్క్ మి కేటీఆర్ అనే ప్రోగ్రామ్ కొంద‌రు నెటిజ‌న్లు కేటీఆర్‌ను గ‌ట్టిగానే కౌంట‌ర్ వేశారు. పీహెచ్సీల‌లో ప్ర‌స్తుతం చేస్తున్న కొవిడ్ టెస్టుల ప‌ద్ధ‌తిని మార్చాల‌ని కేటీఆర్‌ను కోరారు. అంతే కాదు ల్యాబ్ టెక్నీషియ‌న్ల సంఖ్య‌ను ఎందుకు పెంచ‌ట్లేద‌ని ప్ర‌శ్నించారు.

తెలంగాణ‌లో ప్ర‌జ‌ల‌కు ఎందుకు మెరుగైన వైద్యం అందించ‌ట్లేద‌ని నెటిజ‌న్లు కేటీఆర్‌ను ప్ర‌శ్నించారు. ఆస్ప‌త్రులు 24 గంట‌లు ప్ర‌జ‌లకు క‌రోనా సేవ‌లు అందించే విధంగా ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌ట్లేద‌ని ప్ర‌శ్నించారు. ఎన్నిక‌లు వ‌స్తే రాత్రికి రాత్రి డ‌బ్బులు పంచిన‌ట్టు ఇప్పుడు కూడా రాత్రికి రాత్రి వ్యాక్సిన్ ఎందుకు వేయ‌రంటూ మ‌రో నెటిజ‌న్ మండిప‌డ్డారు. వీటిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, లేదంటే రిజైన్ చేయాలంటూ డిమాండ్ చేశారు. అయితే దీనిపై కేటీఆర్ మాత్రం స‌మాధానం ఇవ్వ‌లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version