వైసీపీలో స‌రికొత్త వివాదం.. రోజాను టార్గెట్ చేస్తోందెవ‌రు..?

-

అధికార వైసీపీలో కొత్త త‌ల‌నొప్పులు ఎదుర‌వుతున్నాయా? ఇప్ప‌టికే గుంటూరు, కృష్ణా, విశాఖ‌, విజ‌యన‌గరం జిల్లాల్లో ఉన్న పార్టీ త‌ల‌నొప్పుల‌కు తోడు కొత్త‌గా మ‌రో వివాదం కూడా తెర‌మీదికి వ‌చ్చిందా? అంటే .. అవున‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా చిత్తూరు జిల్లాలోని న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన ఘ‌ట‌న దీనికి ఊతంగా ఉంద‌ని చెబుతున్నారు. నియోజకవర్గంలో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, సత్యవేడు ఎమ్మెల్యే కె.ఆదిమూలం ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. స్థానికం ఎస్సీ, ఎస్టీల కోసం కల్యాణ మండపం, కమ్యూనిటీ హాలు నిర్మాణం కోసం స్థల పరిశీలనకు మంగళవారం నారాయణస్వామి, ఆదిమూలం, కలెక్టర్..‌ నగరి నియోజకవర్గ పరిధిలోని పుత్తూరు పట్టణంలో పర్యటించారు.

అక్కడ ఆర్టీసీ బస్టాండ్‌ పక్కనే ఉన్న తట్రవానికుంటలో 1977లో ఐదుగురు ఎస్సీలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాల పట్టాలిచ్చింది. మురికిగుంట కావడం, పూడ్చడం కష్టం కావడంతో ఇంతకాలం దానిని వదిలేశారు. ఇపుడు ఆ స్థలాన్ని అంబేడ్కర్‌ ట్రస్టుకు అప్పగిస్తే అందులో ఎస్సీ, ఎస్టీల కోసం అంబేడ్కర్‌ పేరిట కల్యాణ మండపం కట్టుకుంటామని ఆదిమూలం ప్రతిపాదించారు. దీంతో నారాయణస్వామి.. ఆదిమూలాన్ని వెంటబెట్టుకుని సంబంధిత స్థలాన్ని పరిశీలించారు. ఈ సమయంలో ఎమ్మెల్యే రోజా నగరిలోని తన ఇంట్లోనే ఉన్నా ఆమెను పిలవలేదు. దీనిపై రోజా, ఆమె అనుచరులు మండిపడ్డారు.

‘ఏం తప్పు చేశామని పిలవలేదు? వాళ్లను వెళ్లవద్దని నేను చెప్పడం లేదు. ఎస్సీల కోసం కల్యాణమండం కట్టడం నాకు కూడా హ్యాపీయే కదా..! నన్నూ పిలిస్తే గౌరవంగా ఫీలవుతా కదా! బాధగా ఉంది. పోనీ ఆ మాట జగన్‌ గారిని చెప్పమనండి. ఎమ్మెల్యేను పిలవనవసరం లేదు.. ప్రొటోకాల్‌ లేదు. నా ఇష్టం అంటే సరిపోతుందా?.’ అని రోజా ప్రశ్నించారు. దీనికి నారాయ‌ణ స్వామి త‌న‌దైన శైలిలో కౌంట‌ర్ ఇచ్చారు. రోజా వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం తిరుపతిలో కౌంటర్‌ ఇచ్చారు.

‘అక్కడకు వెళ్లడానికి రోజా అనుమతి అవసరం లేదు. కలెక్టర్‌ పుత్తూరు మీదుగా తిరుపతి వెళ్తుంటే తీసుకెళ్లి స్థలాలు చూపించాం. దానితో ఆమెకు ఏం సంబంధం’ అని నారాయణస్వామి ప్రశ్నించారు. అయితే, ఈ మొత్తం వ్య‌వ‌హారంలో సీనియ‌ర్ మంత్రి ఒక‌రు ఉన్నార‌నే ప్ర‌చారం సాగుతోంది. మొత్తంగా ఈ ప‌రిస్థితి వైసీపీలో తీవ్ర వివాదానికి దారితీస్తోంద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version