కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో నెలకొన్న తీవ్ర నష్టాలను పూడ్చుకునేందుకు కార్ల తయారీ కంపెనీలు నడుం బిగించాయి. అందులో భాగంగానే ప్రముఖ కార్ల తయారీదారు మారుతీ సుజుకి పలు అద్భుతమైన ఆఫర్లను వినియోగదారులకు అందిస్తోంది. అందుకు గాను ఆ సంస్థ ప్రముఖ ప్రైవేటు బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీతో భాగస్వామ్యం అయ్యింది.
హెచ్‌డీఎఫ్‌సీ ఫైనాన్స్‌తో మారుతీ సుజుకి కార్లను కొనేవారికి ప్రస్తుతం పలు సౌకర్యవంతమైన ఫైనాన్స్ స్కీంలను అందుబాటులో ఉంచారు. ఈ క్రమంలో వినియోగదారులు ఏడాదిలో 3 నెలల కాలానికి చాలా తక్కువ ఈఎంఐతో లోన్ చెల్లించవచ్చు. అలాగే కార్లపై 100 శాతం ఫైనాన్స్ సౌకర్యం అందిస్తారు. ఇక కార్లను కొనే వారు మొదటి 6 నెలలకు రూ.1 లక్షకు కేవలం రూ.899 మాత్రమే ఈఎంఐ చెల్లించవచ్చు. ఇక తక్కువ ఈఎంఐ, డౌన్ పేమెంట్లతో పలు ఇతర ఫైనాన్స్ స్కీంలను కూడా అందిస్తున్నామని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది.
ఇక లోన్ పొందాలనుకునే వారు ఎలాంటి ఫిజికల్ డాక్యుమెంట్లను సబ్‌మిట్ చేయాల్సిన పనిలేదు. అంతా ఆన్‌లైన్‌లోనే డిజిటల్ రూపంలో ప్రాసెసింగ్ చేసి లోన్ ఇస్తారు. కరోనా నేపథ్యంలో తాము కేవలం ఆన్‌లైన్ ద్వారానే లోన్లను ప్రాసెస్ చేస్తున్నామని హెచ్‌డీఎఫ్‌సీ తెలియజేసింది.