ఇప్పటికే ప్రపంచ దేశాలు కరోనా వైరస్‌తో భయబ్రాంతులకు గురవుతున్న నేపథ్యంలో… సబ్ వేరియంట్ పుట్టుకొచ్చి ప్రజలపై విరుచుకుపడుతున్నాయి. అయితే.. మొన్నటి వరకు కరోనా కేసులు లేని ఉత్తర కొరియాలో ఇప్పుడు కరోనా విజృంభిస్తుంది. అయితే.. కరోనాతో వణికిపోతున్న కిమ్ రాజ్యంలో సరికొత్త అంటువ్యాధి వెలుగుచూసింది. ఉత్తరకొరియాలోని ఓడరేవు నగరమైన హేజులో ప్రజలు అంతుచిక్కన అంటువ్యాధితో బాధపడుతున్నారని అధికారులు వెల్లడించారు. ఇది పేగు సంబంధిత వ్యాధిగా గుర్తించారు.
ఈ నేపథ్యంలో రోగులకు అవసరమైన మందులను అందిస్తున్నారని జాతీయ అధికార మీడియా సంస్థ కేసీఎన్‌ఏ తెలిపింది. అయితే ఈ వ్యాధిబారిన ఎంతమందిపడ్డారు, అది ఎలాంటి వ్యాధి అనే విషయాలను మాత్రం వెల్లడిచింది. కాగా, దేశంలో కొత్తగా 26,010 మంది జ్వర లక్షణాలతో బాధపడుతున్నారని పేర్కొన్నది. దీంతో దేశంలో జ్వర సంబంధిత కేసులు 40 లక్షల 56 వేలకు చేరాయి. ఇప్పటివరకు దేశంలో 76 కరోనా కేసులు నమోదయ్యాయి.