ఏనుగుల దాడిలో భ‌ద్రాచలానికి చెందిన‌ ఆర్మీ జ‌వాన్ మృతి

-

అసోంలో విషాదం చోటు చేసుకుంది. ఏనుగుల దాడిలో భ‌ద్రాచలానికి చెందిన‌ ఆర్మీ జ‌వాన్ మృతి చెందాడు. ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఏనుగుల దాడిలో భ‌ద్రాచలానికి చెందిన‌ ఆర్మీ జ‌వాన్ మృతి చెందిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అసోంలోని అమ్రిబారిలో ఆర్మీ సిబ్బందిపై దాడికి య‌త్నించారు కొన్ని ఏనుగులు. అయితే.. త‌ప్పించుకునే క్ర‌మంలో కింద‌ప‌డిపోయాడు భద్రాచ‌లం అశోక్‌న‌గ‌ర్‌కు చెందిన కొంగా సాయిచంద్రారావు.

Army jawan from Bhadrachalam trampled to death by elephant in Assam

అనంతరం ఏనుగులు దాడి చేయ‌డంతో అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. భద్రాచలం పట్టణానికి చెందిన ఆర్మీ నాయబ్ సుబేదార్ కొంగా సాయిచంద్రారావు ఆదివారం అస్సాంలో జరిగిన ఏనుగుల దాడిలో మృతి చెందారు. కొంత‌కాలంగా అసోంలోని సోనిత్‌పూర్ జిల్లా రంగాపారాలో ఆర్మీ సుబేదార్‌గా విధులు నిర్వహిస్తున్నాడు సాయిచంద్ర‌రావు. ఇక సాయిచంద్రరావు మృతదేహాన్ని భ‌ద్రాచ‌లానికి తీసుకువ‌చ్చి, కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గించారు ఆర్మీ అధి కారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version