HYD : అమీర్‌పేట్‌లో మహిళపై గ్యాంగ్ రేప్

-

హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకూ మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఆఫీసులు, స్కూళ్ల నుంచి తిరిగి వెళ్తున్న క్రమంలో కొన్ని మానవ మృగాలు వారిపై దారుణంగా అఘాయిత్యాలకు పాల్పడున్నాయి.ఇటీవల కాలంలో హత్యాచార ఘటనలు సైతం పెరిగిపోతున్నాయి. దీంతో రాత్రుళ్లే కాదు పట్టపగలు కూడా ఒంటరిగా బయటకు వెళ్లేందుకు మహిళలు, అమ్మాయిలు జంకుతున్నారు.

తాజాగా నగరంలోని అమీర్‌పేట్ మధురానగర్ పీఎస్ పరిధిలో ఓ మహిళ దారుణంగా గ్యాంగ్ రేపునకు గురైంది. ఇళ్లల్లో పనికి వెళ్లే ఓ మహిళ సోమవారం కొండాపూర్ లో పనికివెళ్లి తిరిగి వస్తుండగా.. ఆటోలో వచ్చిన ముగ్గురు దుండగులు తమ గదిలో బట్టలు ఉతకాలని చెప్పి తీసుకెళ్లారు. అనంతరం ఆమెను తమ రూములో బంధించారు. నోట్లో బట్టలు కుక్కి తీవ్రంగా హింసించారు. అనంతరం అత్యాచారం చేశారు. ఎలాగోలా తప్పించుకున్న ఆమె నగ్నంగా బయటకు రాగా.. పక్కింటి వారు బాధితురాలికి బట్టలు ఇచ్చి సాయం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version