బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు మాత్రం ఆగడం లేదు. ఇటీవల ఆయన్ను చంపుతామని, లేదంటే రూ.2 కోట్లు ఇవ్వాలని ముంబై ట్రాఫిక్ పోలీసులకు ఒక బెదిరింపు కాల్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో కాల్ చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా మరోసారి ముంబై పోలీసులకు మరో బెదిరింపు కాల్ చేసింది.
తాము బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి కాల్ చేస్తున్నామని, కృష్ణ జింకలను చంపినందుకు సల్మాన్ ఖాన్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని.. లేనియెడల రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.లేనియెడల బాంద్రా మాజీ ఎమ్మెల్యే సిద్ధిఖీని చంపినట్లే చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ముంబై పోలీసులు ఆ కాల్ ఎవరు చేశారు? ఎక్కడి నుంచి వచ్చిందని? ట్రేస్ చేసే పనిలో నిమగ్నమయ్యారు.